Voter ID: ఓటర్ ఐడీ కార్డ్‌ పోయిందా..! టెన్షన్ పడకండి ఇలా చేయండి..

Voter ID Card is Gone do not be Tension you can Take a Second Voter ID
x

ఓటర్ ఐడీ కార్డు (ఫైల్ ఇమేజ్)

Highlights

Voter ID: Voter ID: ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మాదిరిగానే ఓటర్ ఐడి కార్డ్ కూడా ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఒకటి

Voter ID: ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మాదిరిగానే ఓటర్ ఐడి కార్డ్ కూడా ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఒకటి. ఇది మేజర్‌ అయిన ప్రతి పౌరుడికి కచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఏదో ఒక సమయంలో దీని అవసరం పడుతుంది. అందుకే దీనిని భద్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ పొరపాటున మీ ఓటరు ID పోయినట్లయితే మీరు బాధపడకండి. మీ ఇంటి నుంచి మరొకదాన్ని పొందవచ్చు. మీరు కొత్త ఓటర్‌ ఐడీ కార్డ్‌ ఎలా పొందాలో ఈ ప్రక్రియ ద్వారా తెలుస్తుంది.

నిజానికి ప్రతి భారతీయుడికి 18 ఏళ్లు నిండిన వెంటనే ఓటు హక్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఓటర్‌ ఐడీ కార్డ్ జారీ అయితేనే ఎన్నికలలో పాల్గొనవచ్చు. లేదంటే కుదరదు. ఇది కాకుండా ఈ కార్డ్ ఎక్కడైనా మీ గుర్తింపు కార్డుగా కూడా పని చేస్తుంది. కాబట్టి మీ ఓటరు ఐడీ కార్డ్ పోయినట్లయితే మీరు డూప్లికేట్ ఓటర్ ఐడీ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ చాలా సులభం. మీరు దీన్ని ఇంట్లో కూర్చొని కూడా చేయవచ్చు.

1. డూప్లికేట్ ఓటర్ ID కార్డ్‌ని తయారు చేయడానికి ముందుగా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ voterportal.eci.gov.inకి వెళ్లాలి. మీ సమాచారం అందించి లాగిన్ అవ్వాలి. తర్వాత e-EPICని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

2. డౌన్‌లోడ్ చేసిన తర్వాత మీ e-EPIC నంబర్ లేదా రిఫరెన్స్ నంబర్‌ను నమోదు చేయాలి. వెంటనే మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌కు OTP వస్తుంది. OTPని సమర్పించిన తర్వాత మీ డిజిటల్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ కార్డ్‌లో రిజిస్టర్ నంబర్ భిన్నంగా ఉన్నట్లయితే కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడానికి ముందుగా మీరు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

3. మీరు KYC ప్రాసెస్‌ని పూర్తి చేసిన వెంటనే మీ రిజిస్టర్డ్ నంబర్‌కు మెసేజ్ వస్తుంది. దీని తర్వాత మీరు డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే మీ ఫోన్‌లో ఓటర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసేటప్పుడు కూడా మీరు డిజిటల్ ఓటర్ ఐడి కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

4. మీరు డూప్లికేట్ ఓటర్ ఐడి కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే దీని కోసం మీరు కొన్ని వివరాలను కూడా అందించాల్సి ఉంటుంది. రాష్ట్రం పేరు, మీ పూర్తి పేరు, చిరునామా, పుట్టిన తేదీ, డూప్లికేట్ ఓటరు ID కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి ఖచ్చితమైన కారణం తెలియజేయాలి. ఇది కాకుండా మీ ఓటరు ఐడి ఎక్కడైనా పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా మీరు ఎఫ్‌ఐఆర్ కాపీని కూడా అందించాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories