వీర విరాట్‌... అన్ని ఫార్మాట్లలో కొహ్లీనే కింగ్‌

వీర విరాట్‌... అన్ని ఫార్మాట్లలో కొహ్లీనే కింగ్‌
x
Highlights

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ...క్రికెట్ ఫీల్డ్ లో మాత్రమే కాదు...ఐసీసీ అవార్డులు గెలుచుకోడంలోనూ తనకుతానే సాటిగా నిలిచాడు. క్రికెట్ చరిత్రలోనే...

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ...క్రికెట్ ఫీల్డ్ లో మాత్రమే కాదు...ఐసీసీ అవార్డులు గెలుచుకోడంలోనూ తనకుతానే సాటిగా నిలిచాడు. క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా...ఐసీసీ అత్యుత్తమ క్రికెటర్ అవార్డుతో పాటు...ఐసీసీ వన్డే, ఐసీసీ టెస్ట్ క్రికెట్ అవార్డులకు సైతం ఎంపికయ్యాడు. ప్రపంచ క్రికెట్లో ...టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ హవా కొనసాగుతోంది. క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ కొహ్లీ పరుగుల మోత మోగించడమే కాదు...కెప్టెన్ గాను టీమిండియాను అత్యంత విజయవంతమైన జట్టుగా నిలుపుతున్నాడు. క్రికెట్ ఫీల్డ్ లో మాత్రమే కాదు...ఫీల్డ్ వెలుపలా తన ఆధిక్యాన్ని...ఆధిపత్యాన్ని కొహ్లీ కొనసాగిస్తున్నాడు. 2018 ఐసీసీ అవార్డుల రేస్ లో కొహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ఒకటి కాదు...రెండు కాదు...ఏకంగా మూడు అవార్డులతో క్లీన్ స్వీప్ సాధించాడు. ఒకే ఏడాది ఐసీసీ మూడు అత్యుత్తమ అవార్డులూ సాధించిన తొలి క్రికెటర్ గా కొహ్లీ చరిత్ర సృష్టించాడు. 2018 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకూ మధ్య జరిగిన టెస్టులు, వన్డేల ప్రాతిపదికన ఈ అవార్డులకు ఐసీసీ ఓటింగ్ నిర్వహించింది. సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో మాత్రమే కాదు...ఇన్ స్టంట్ వన్డే క్రికెట్లో సైతం కొహ్లీనే ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ గా మాత్రమే కాదు....పరుగుల మోతలోనూ తనకు తానే సాటిగా నిలిచాడు.

విరాట్ కొహ్లీ తన అసాధారణ ఆటతీరుతో....ఐసీసీ అత్యుత్తమ క్రికెటర్, ఐసీసీ అత్యుత్తమ వన్డే క్రికెటర్ , ఐసీసీ అత్యుత్తమ టెస్ట్ క్రికెటర్ అవార్డులను సొంతం చేసుకొన్నాడు. అంతేకాదు...ఐసీసీ బెస్ట్ క్రికెటర్ కు ఇచ్చే... సర్ గార్ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని వరుసగా రెండో ఏడాది సైతం కొహ్లీ సాధించాడు. గత ఏడాది కాలంలో...కొహ్లీ ఆడిన 13 టెస్టుల్లో మొత్తం1322 పరుగులు సాధించాడు. అంతేకాదు...కొహ్లీ కెప్టెన్ గా టీమిండియా...ఆరు విజయాలు, ఏడు పరాజయాల రికార్డుతో నిలిచింది. టెస్ట్ క్రికెట్ తో పోల్చిచూస్తే...వన్డే క్రికెట్లో కొహ్లీ మరింత అసాధారణంగా రాణించాడు. 14 వన్డేల్లో 6 సెంచరీలతో 1202 పరుగులు సాధించాడు.

కొహ్లీ సారథిగా.. టీమిండియా...వన్డేలలో 9 విజయాలు, 4 పరాజయాలు చవిచూసింది. ఓ మ్యాచ్ ను టైగా ముగించింది. కొహ్లీ ఐసీసీ అవార్డులు గెలుచుకోడం ఇదే మొదటిసారికాదు.2012 ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా తన తొలి అవార్డు అందుకొన్న కొహ్లీ.. 2017లో ఐసీసీ బెస్ట్ క్రికెటర్ గా ..సర్ గార్ ఫీల్డ్ సోబర్స్ అవార్డును సాధించాడు. గత సీజన్లో విరాట్ కొహ్లీ ఆటతీరు అద్భుతమంటూ ఐసీసీ సీఈవో డేవి రిచర్డ్స్ సన్ పొగడ్తల వర్షం కురిపించారు. విరాట్ కొహ్లీ లాంటి అరుదైన క్రికెటర్ అవసరం క్రికెట్ కు ఎంతైనా ఉందని కొనియాడారు. 2018 క్రికెట్ సీజన్ ను రికార్డుల మోత, పరుగుల వెల్లువతో ముగించిన కొహ్లీ...2019 సీజన్లోనూ అదేజోరు కొనసాగించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories