Viral Video: ఈ తల్లికి 'మదర్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డ్‌ ఇవ్వాల్సిందే.. ఎందుకంటారా? ఐతే మీరే చూడండి

Viral Video: ఈ తల్లికి మదర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డ్‌ ఇవ్వాల్సిందే.. ఎందుకంటారా? ఐతే మీరే చూడండి
x
Highlights

Viral Video of a Mother and Son: ఏమంటూ సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిందో ఎప్పడు ఎలాంటి వీడియోలు చూడాల్సి వస్తుందో తెలియడం లేదు. నిత్యం వందలాది వీడియోలు...

Viral Video of a Mother and Son: ఏమంటూ సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిందో ఎప్పడు ఎలాంటి వీడియోలు చూడాల్సి వస్తుందో తెలియడం లేదు. నిత్యం వందలాది వీడియోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. అప్పటి వరకు ప్రపంచానికి తెలియని తమ ట్యాలెంట్‌ను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఆ వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

స్కూల్‌కి వెళ్తున్న సమయంలో కొడుకును రెడీ చేస్తున్న ఓ తల్లికి సంబంధించి వీడియో ఇది. సాధారణంగా స్కూలుకు వెళ్లే సమయంలో షూలతో పాటు సాక్సులను కూడా ధరించాల్సి ఉంటుంది. ఇలా ధరించకపోతే స్కూల్‌లో టీచర్లు పనిష్మంట్ విధిస్తుంటారు. కొన్ని స్కూల్స్‌లో అయితే ఫైన్‌ కూడా వేస్తుంటారు. అయితే సాక్స్‌ అందుబాటులో లేవో మరి రాత్రి ఉతికిన సాక్సులు ఆరలేదో తెలియదు కానీ ఓ తల్లి తన కుమారుడిని వెరైటీ సాక్సులతో స్కూల్‌కి పంపించారు.

సాక్సులు లేకపోవడంతో షూస్‌లను మాములుగానే ధరింపజేసి ఆ తర్వాత ఓ అదిరిపోయే ఐడియా చేశారు. సాక్సులు లేకున్నప్పటికీ... ఉన్నట్లు భ్రమ కలిగించేందుకుగాను ఓ ప్లాన్‌ వేశారు. వంట గదిలో బాగా మసి పట్టిన ఓ వంట పాత్రను తీసుకున్నారామె. అనంతరం ఆ పాత్రకు ఉన్న మసిని తీస్తూ ఆ అబ్బాయి కాళ్లకు పూశారు. అచ్చంగా సాక్సులను ధరించినట్లుగానే మసితో కాళ్లకు నింపేశారు. ఆ తర్వాత స్కూలుకు పంపించారు.

ఇదంతా వీడియోగా తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నిజంగానే ఏం ఐడియా అసలు అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ఈమెకు కచ్చితంగా మదర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డ్ ఇవ్వాల్సిందే అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం ఇది పక్కాగా స్క్రిప్ట్‌ వీడియోలాగే ఉందంటున్నారు. మొత్తంమీద ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories