Viral Video: ప్రీ వెడ్డింగ్‌ షూట్ అంటే ఇలా కూడా ఉంటుందా.? మరి ఇంత దారుణమా..

Viral Video
x

Viral Video

Highlights

Viral Video: ఓ జంట అందరిలాగే ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ నిర్వహించుకుంది. అయితే అందరిలా చేస్తే వెరైటీ ఏముంది అనుకున్నారో ఏమో కానీ.. నాలుగు గోడల మధ్య చేసే పనిని ప్రపంచానికి చూపించారు.

Viral Video: ప్రస్తుతం పెళ్లి ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయింది. పెళ్లి ఏర్పాట్లకయ్యే ఖర్చు ఒక ఎత్తు అయితే.. కొత్త జంట మేకప్‌లకు, ప్రీ వెడ్డింగ్‌ షూటింగ్‌లకు ఖర్చు మరో ఎత్తు అవుతోంది. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ షూట్‌కు భారీగా ఆదరణ పెరుగుతోంది. మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు కూడా ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లు చేసుకుంటున్నారు.

అయితే ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. ఎలాగైనా కొత్తగా కనిపించాలన్న ఉద్దేశంతో కొత్త జంట రెచ్చి పోతున్నారు. రకరకాల మార్గాల్లో వీడియోలు చేస్తూ రచ్చ చేస్తున్నారు. అయితే ఈ వీడియో షూటింగ్‌లు చూడ ముచ్చటగా ఉంటే పర్లేదు కానీ పరిధి దాటితే మాత్రం పరిస్థితి మరో రకంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఓ వీడియో అసలు ప్రీ వెడ్డింగ్‌ షూటింగ్ కల్చర్‌ ఎటు వెళ్తుందన్న ప్రశ్నలను లేవనెత్తుతోంది.

వివరాల్లోకి వెళితే.. ఓ జంట అందరిలాగే ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ నిర్వహించుకుంది. అయితే అందరిలా చేస్తే వెరైటీ ఏముంది అనుకున్నారో ఏమో కానీ.. నాలుగు గోడల మధ్య చేసే పనిని ప్రపంచానికి చూపించారు. అలుమగలు ఇద్దరు గుట్టుగా చేసుకునే పనిని నలుగురికి చూపించారు. ఒకరిని ఒకరు గాఢంగా ముద్దు పెట్టుకుంటూ వీడియో షూట్‌ చేయించుకున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఇదేం ప్రీ వెడ్డింగ్‌ షూటింగ్‌ అసలు, ఇంకా ఎలాంటి దారుణాలు చూడాల్సి వస్తాయో అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఇదేదో సినిమా షూటింగ్‌కు సంబంధించిన వీడియో అయ్యుండొచ్చని అభిప్రాయపడుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories