Zero Gravity in ISS: అంతరిక్షంలో కెచప్ తింటే ఎలా ఉంటుందో తెలుసా? వైరల్ అవుతున్న వీడియో

Zero Gravity in ISS: అంతరిక్షంలో కెచప్ తింటే ఎలా ఉంటుందో తెలుసా? వైరల్ అవుతున్న వీడియో
x
Highlights

Ketchup Video in ISS: అంతరిక్షంలో జరిగే వింతలు, విశేషాలను ఆసక్తిగా చూసి మురిసిపోయే వారి కోసం ఇప్పుడు ఇంటర్నెట్లో ఓ వైరల్ వీడియో రెడీగా ఉంది. నాసా...

Ketchup Video in ISS: అంతరిక్షంలో జరిగే వింతలు, విశేషాలను ఆసక్తిగా చూసి మురిసిపోయే వారి కోసం ఇప్పుడు ఇంటర్నెట్లో ఓ వైరల్ వీడియో రెడీగా ఉంది. నాసా ఆస్ట్రోనాట్ మాథ్యూ డామినిక్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో కెచప్ తింటుండగా తీసిన వీడియో అది. కెచప్ తినడంలో వింతేం ఉంది కదా అని మీకు డౌట్ రావచ్చు. కాకపోతే ఇది సమ్‌థింగ్ డిఫరెంట్. ఎందుకంటే.. ఎప్పుడూ చూసే అవకాశం రాని దృశ్యాన్ని చూస్తున్నప్పుడు కలిగే ఫీలింగే అది.

గురుత్వాకర్షణ శక్తి అస్సలు ఏ మాత్రం పనిచేయని అంతరిక్షంలో ఏదైనా గాల్లోకి విడిచిపెడితే అది అలా తేలుతూ ఉంటుంది. సైన్స్ ప్రియులకు అందరికీ ఈ విషయం తెలిసిందే. ఘన రూపంలో ఉండే వస్తువులు గాల్లో తేలాడుతూ ఉంటాయి. అందులో క్లారిటీ ఉంది. మరి ఏదైనా పేస్ట్, లేదా చిక్కటి ద్రవ రూపంలో ఉన్న పదార్థాన్ని గాల్లోకి రిలీజ్ చేస్తే అది ఎలా రియాక్ట్ అవుతుంది అనే విషయంలో క్లారిటీ లేదు కదా!! అయితే, ఈ వీడియో మీ కోసమే.. అందుకే ఈ వీడియో సమ్‌థింగ్ డిఫరెంట్.

ఈ వీడియోలో చూస్తే.. మాథ్యూ డామినిక్ కెచప్ బాటిల్‌ని అటు ఇటు ఊపడం కనబడుతోంది. అదే సమయంలో తన పక్కనే ఉన్న మరో ఆస్ట్రోనాట్ మధ్యలో కల్పించుకుంటూ.. ఏయ్ ఏం చేస్తున్నావ్ అని అడిగారు. అందుకు మాథ్యూ స్పందిస్తూ.. ఇప్పుడీ కెచప్‌ని నేను దూరం నుండే ఇలా తినబోతున్నాను అంటూ తన ప్రయోగాన్ని మొదలుపెట్టారు. కెచప్ బాటిల్‌ని తన నోటికి దూరంగా పెట్టి గట్టిగా ఒత్తారు. ఆశ్చర్యం ఏంటంటే.. అలా బాటిల్లోంచి రిలీజ్ అయిన కెచప్ గాల్లో ట్రావెల్ చేస్తూ మాథ్యూ నోట్లోకి వెళ్లింది కానీ మధ్యలో ఎక్కడ కిందకు జారలేదు. కెచప్ లవర్స్‌కి ఈ ఇంట్రెస్టింగ్ సైన్స్ స్టఫ్ చూపించడానికే ఈ వీడియో అని ఆ ఆస్ట్రోనాట్ సైతం తన ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

అంతరిక్షంలో కెచప్‌పై జీరో గ్రావిటేషన్ ఎలా పనిచేస్తుందో చూపించడానికే మాథ్యూ ఈ వీడియో చేశారు అని అర్థం అవుతోందంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజెన్స్. ఒకరకంగా అంతరిక్షంలో గ్రావిటీ ఎలా పనిచేస్తుందని చెప్పడానికి ఈ వీడియో ఎడ్యుకేషనల్ వీడియోగానూ పనిచేస్తుందంటున్నారు ఇంకొంతమంది నెటిజెన్స్.

అంతరిక్షంలో కెచప్ సంగతి ఇలా ఉంటే, బాటిల్ నుండి రిలీజ్ చేసిన తేనే ఎలా రియాక్ట్ అవుతుందని చెబుతూ మరో వీడియో కూడా ఉంది. హార్ట్ వైర్ మీడియా అనే ఎక్స్ యూజర్ కెచప్ వీడియోకు రిప్లైగా ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లోనే హనీ బాటిల్‌ని నిటారుగా పెట్టి మరీ తేనేను బయటికి వచ్చేలా ఒత్తినప్పటికీ.. తేనే మాత్రం బాటిల్ నుండి బయటికి రాగానే కిందకు జారిపోకుండా నేరుగా పై దిశలోనే వెళ్లడం ఈ వీడియోలో చూడొచ్చు. అది కూడా మూడు రెట్లు వేగం పెంచి మరీ చూపిస్తున్న వీడియో ఇది అంటూ సదరు ఎక్స్ యూజర్ తన పోస్టులో వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories