కేసీఆర్ టు సైదిరెడ్డి ... ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ జోరు..

కేసీఆర్ టు సైదిరెడ్డి ... ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ జోరు..
x
Highlights

ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కి తిరుగులేదని చెప్పేందుకు హుజూర్ నగర్ ఉపఎన్నికలు మరోసారి సాక్ష్యం అయ్యాయి. తాజాగా వెలువడిన ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్ది...

ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కి తిరుగులేదని చెప్పేందుకు హుజూర్ నగర్ ఉపఎన్నికలు మరోసారి సాక్ష్యం అయ్యాయి. తాజాగా వెలువడిన ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్ది శానంపుడి సైదిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్ది ఉత్తమ్ పద్మావతిపై భారీ మెజారిటీతో గెలిచారు. దీనితో మొదటిసారిగా హుజూర్ నగర్ లో జెండా ఎగరవేసింది టీఆర్ఎస్..

ఈ ఉపఎన్నిక మాత్రమే కాదు.. గతంలోనూ టీఆర్ఎస్ చాలా ఉప ఎన్నికల్లో సత్తా చాటింది. 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన అనంతరం కేసీఆర్ సిద్దిపేట అసెంబ్లీకి గాను ఉపఎన్నికల బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో అయన 58 వేల పైచిలుకు మెజారిటీతో గెలిచి సత్తా చాటారు. ఇక్కడే మొదటి ఉపఎన్నిక విజయాన్ని సొంతం చేసుకుంది టీఆర్ఎస్.. ఆ తర్వాత కరీంనగర్ ఎంపీగా కేసీఆర్ 2006, 2008 ఉప ఎన్నికల్లో పోటి చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు.

కేవలం కేసీఆర్ మాత్రమే కాదు.. టీఆర్ఎస్ నేతలు కూడా ఉప ఎన్నికలను ఎదురుకొని విజయాపు బావుట ఎగరవేశారు. 2004లో సిద్ధిపేట నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో నిలిచి హరీష్ రావు విజయం సాధించారు. అదే విధంగా 2008, 2010 లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా దీనినే రిపీట్ చేసారు హరీష్.. ఇక 2010 సిరిసిల్ల ఉపఎన్నికల్లో కేటీఆర్ భారీ మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు.. రాష్ట్రం ఏర్పడక ముందు కొన్ని స్థానాల్లో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయింది.కానీ రాష్ట్రం ఏర్పడ్డాక మాత్రం టీఆర్ఎస్ ఎదురుకున్న ప్రతి ఉపఎన్నికల్లో ఎక్కడ కూడా ఓటమిని చవిచూడలేదు.. తాజాగా జరిగిన హుజూర్ నగర్ ఉపఎన్నిక వరకు టీఆర్ఎస్ తన జోరును కనబరుస్తూ వచ్చింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories