Top-6 News of the Day: బడ్జెట్ కు సవరణలు చేయాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం: మరో 5 ముఖ్యాంశాలు

Top 6 News of the Day 24th July 2024
x

Top-6 News of the Day: బడ్జెట్ కు సవరణలు చేయాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం: మరో 5 ముఖ్యాంశాలు

Highlights

Top-6 News of the Day: బడ్జెట్ కు సవరణలు చేయాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం: మరో 5 ముఖ్యాంశాలు

1.బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయంపై తీర్మానం

కేంద్ర బడ్జెట్ 2024-25 కు సవరణలు చేసి తెలంగాణకు న్యాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ శాసనసభ బుధవారం తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి ముందుగా చర్చ జరిగింది. ఈ చర్చ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానానికి అసెంబ్లీలోని అన్ని పార్టీల సభ్యులు మద్దతు ప్రకటించారు.తెలంగాణ పట్ల కేంద్రం తీరుపై నిరసన వ్యక్తం చేసింది. బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణకు కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించలేదని రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపిందని బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆరోపించాయి.


2. వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులను నిరసిస్తూ దిల్లీలో జగన్ ధర్నా

ఆంధ్రప్రదేశ్ లో ఎన్ డీ ఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం దిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. ఈ ధర్నాకు పలు పార్టీలు సంఘీభావం తెలిపాయి. అధికార మార్పిడి జరిగిన తర్వాత 35 రాజకీయ హత్యలు జరిగాయని ఆయన ఆరోపించారు. వెయ్యికి పైగా అక్రమ కేసులు బనాయించారన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.


3. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ బుధవారం ఆమోదం తెలిపింది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఈ చట్టం తెచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని రద్దు చేస్తామని టీడీపీ, జనసేన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు ఈ చట్టాన్ని రద్దు చేసే ఫైలుపై సంతకం చేశారు. ఇవాళ ఈ బిల్లును రద్దుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మరో వైపు హెల్త్ యూనివర్శిటీకి ఉన్న వైఎస్ఆర్ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీగా మారుస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది.


4. సింగరేణిని ప్రైవేటీకరించం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. లోక్ సభ ప్రశ్నోత్తరాల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమాధానమిచ్చారు. దేశంలో ఏ బొగ్గు గనిని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు.


5. నీట్ ను వ్యతిరేకిస్తూ బెంగాల్ అసెంబ్లీ తీర్మానం

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ ప్రవేశ పరీక్షను వ్యతిరేకిస్తూ పశ్చిమబెంగాల్ అసెంబ్లీ తీర్మానం చేసింది. నీట్ ప్రవేశ పరీక్షను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసిన తొలి రాష్ట్రం తమిళనాడు. నీట్ ప్రవేశ పరీక్షను రద్దు చేసి గతంలో మాదిరిగానే వైద్య విద్య ఆడ్మిషన్లు నిర్వహించాలనే డిమాండ్లు తెరమీదికి వచ్చాయి. ఈ ఏడాది నిర్వహించిన నీట్ యూజీ -2024 ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం లీకైంది. ఈ పరీక్షను రద్దు చేయాలని కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్లను విచారించిన ఉన్నత న్యాయస్థానం మాత్రం మళ్లీ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.


6. మద్యం అక్రమాలపై సీఐడీతో విచారణ: చంద్రబాబు

ఎక్సై్జ్ శాఖపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు బుధవారం ఏపీ అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. నేరస్తులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరమయమౌతాయని ఆయన చెప్పారు. ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేస్తామని సీఎం ప్రకటించారు. సరైన పాలసీలు తెస్తామన్నారు. జగన్ ప్రభుత్వంలో మద్యం అక్రమాలపై సీఐడీతో విచారణ జరిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories