Spiciest Chilies: గుంటూరు మిర్చి కంటే ఇవి మరింత హాట్‌ గురూ.. తినడానికి ట్రై చేస్తారా..!

These are the Worlds Spiciest Chilies That People are Afraid to Eat
x

Spiciest Chilies: గుంటూరు మిర్చి కంటే ఇవి మరింత హాట్‌ గురూ.. తినడానికి ట్రై చేస్తారా..!

Highlights

Spiciest Chilies: ఇండియన్స్‌ ఎక్కువగా స్పైసీ పుడ్‌ని ఇష్టపడుతారు.

Spiciest Chilies: ఇండియన్స్‌ ఎక్కువగా స్పైసీ పుడ్‌ని ఇష్టపడుతారు. చాలామంది మార్కెట్‌కు వెళ్లారంటే పచ్చిమిర్చి కొనడం అస్సలు మరిచిపోరు. మన తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు కారంకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే ప్రపంచంలో అత్యంత కారంగా ఉండే పచ్చిమిర్చి గురించి చాలామందికి తెలియకపోవచ్చు. వీటిని తినడం కాదు తాకితే చాలు కళ్లనుంచి నీరు రావాల్సిందే. అలాంటి హాటెస్ట్‌ పచ్చిమిర్చి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ప్రపంచంలోనే అత్యంత హాట్‌గా ఉండే మిరపకాయ గురించి మాట్లాడినట్లయితే దానిపేరు భూత్ జోలాకియా. దీనిని అస్సాంలో పండిస్తారు. ఈ కారం ప్రపంచంలోనే అత్యంత హాటెస్ట్‌. 2007లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో దీని పేరు నమోదైంది. విశేషమేమిటంటే దీన్ని ఘోస్ట్ పెప్పర్ అని పిలుస్తారు. అయితే అస్సాం ప్రజలు దీనిని యు-మొరోక్, లాల్ నాగా లేదా నాగా జోలోకియా అని పిలుస్తారు. అస్సాంతో పాటు, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లలో దీనిని సాగు చేస్తారు. భూత్ జోలాకియాని చాలా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీని రేటు కూడా ఎక్కువగా ఉంటుంది.

అలాగే డ్రాగన్స్ బ్రీత్ అనే చిల్లీ రెండో స్థానంలో ఉంది. దీనిని బ్రిటన్‌లో సాగు చేస్తారు. ఇది సాధారణ మిరపకాయ కంటే దాదాపు 2000 రెట్లు ఎక్కువ కారంగా ఉంటుంది. దీనిని ఔషధాలలో ఉపయోగిస్తారు. అలాగే నాగ వైపర్ ప్రపంచంలోని అత్యంత హాటెస్ట్‌ మిర్చిలలో మూడో నెంబర్‌ ఆక్రమించింది. ఇది ఒకరకమైన హైబ్రిడ్ మిరపకాయ. దీనిని కూడా బ్రిటన్‌లో పండిస్తారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఒక్కో మిర్చి రంగు ఒక్కో విధంగా ఉంటుంది. ఇది ఎరుపు, ఆకుపచ్చ, నలుపు రంగులో ఉంటుంది. కరోలినా రీపర్ కూడా చాలా హాట్‌ మిర్చి. దీని పేరు 2013లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బుక్‌లో స్పైసినెస్ విషయంలో నమోదు చేశారు. ఇది అమెరికాలో సాగు చేస్తారు. కరోలినా రీపర్ ఒక రకమైన హైబ్రిడ్ మిర్చి. ఈ మిరపకాయ చాలా కారంగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories