Restaurants: దేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన రెస్టారెంట్లు ఇవే.. వీటి చరిత్ర ఏంటో తెలుసా..?

These Are The Restaurants That Have a History of Hundreds of Years in the Country | Telugu Online News
x

Restaurants: దేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన రెస్టారెంట్లు ఇవే.. వీటి చరిత్ర ఏంటో తెలుసా..?

Highlights

Restaurants: దేశంలో కొన్ని ప్రాంతాలు చరిత్ర పరంగా, అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల చాలా ఫేమస్‌గా మారిపోతాయి...

Restaurants: దేశంలో కొన్ని ప్రాంతాలు చరిత్ర పరంగా, అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల చాలా ఫేమస్‌గా మారిపోతాయి. అలా ఇండియాలో వందేళ్లు దాటిన రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ఇవి బ్రిటీష్ కాలం నుంచి ఇప్పటికి రన్‌ అవుతున్నాయంటే ఇప్పటికి ఆశ్చర్యం కలుగుతుంది. రెస్టారెంట్‌కి సంబంధించి మంచి ఆహారం, కొన్ని ప్రత్యేక వస్తువులు, ఇంటీరియర్ కారణంగా పర్యాటకులు రెస్టారెంట్‌కి వస్తారు. కానీ భారతదేశంలో అలాంటి కొన్ని రెస్టారెంట్లు చాలా ఉన్నాయి. అవి వాటి ఆహారానికే కాకుండా చరిత్ర కారణంగా కూడా ప్రసిద్ధి చెందాయి. మీరు ఆహార ప్రియులైతే తప్పకుండా ఒకసారి ఇక్కడికి వెళ్లండి. అలాంటి రెస్టారెంట్ల గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

1. ఇండియన్ కాఫీ హౌస్, కోల్‌కతా

ఇండియన్ కాఫీ హౌస్ అనేది దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన రెస్టారెంట్. ఇంతకుముందు దీని పేరు ఆల్బర్ట్ హౌస్ అని ఉండేది. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దీని పేరు కాఫీ హౌస్‌గా మార్చారు. వాస్తవానికి దీనిని 1876లో ప్రారంభించారు. ఈ రెస్టారెంట్‌ కోల్‌కతాకు గర్వకారణం అని చెప్పవచ్చు.

2. తుండే కబాబ్

ఈ 115 సంవత్సరాల పురాతన ప్రదేశం భారతదేశంలోని కబాబ్ ప్రియులకు చాలా ప్రసిద్ధి చెందింది. నేడు కబాబ్‌ను ఆహార ప్రియులు చాలా ఇష్టపడుతారు. మీకు కబాబ్స్‌ అంటే ఇష్టముంటే కచ్చితంగా ఒక్కసారి ఇక్కడికి వచ్చి తినండి. ఇది 1905లో ప్రారంభించారు. ఇక్కడ కబాబ్ తయారీకి దాదాపు 125 పదార్థాలను ఉపయోగిస్తారు. అందుకే చాలా ఫేమస్.

3. గ్లెన్రిస్, డార్జిలింగ్

డార్జిలింగ్ ప్రకృతి అందాలకు నెలవు. హిల్ టౌన్‌లోని పురాతన రెస్టారెంట్లలో ఒకటైన గ్లెన్‌రిస్ 130 సంవత్సరాలకు పైగా పురాతనమైనది. ఇక్కడి ఆహారం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ గ్లెనరీలోని బేకరీ చాలా ప్రత్యేకమైనది ఆహారం తింటూ అందమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు.

4. లియోపోల్డ్ కేఫ్, ముంబై

ముంబైలో తినడానికి, తాగడానికి చాలా ప్రత్యేక ప్రదేశాలు ఉన్నాయి కానీ లియోపోల్డ్ రెస్టారెంట్ చాలా ఫేమస్. దీనికి 150 సంవత్సరాల ప్రాచీన చరిత్ర ఉంది. 2008లో ముంబై దాడి జరిగినప్పుడు ఉగ్రవాదులు ఈ రెస్టారెంట్‌ని కూడా టార్గెట్ చేశారు. విశేషమేమిటంటే ఈ ప్రదేశం పర్యాటకులలోనే కాకుండా స్థానిక ప్రజలలో బాగా రద్దీగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories