ఈ పాములతో జరభద్రం...

ఈ పాములతో జరభద్రం...
x
Highlights

పామును చూస్తే చాలు అయ్యబాబోయ్ అంటూ ఇక్కడున్న వారు కూడా అంత దూరం పరుగులు తీస్తారు. కాని ప్రస్తుత కాలంలో డిస్కవరీ, నేషనల్ జాగ్రఫిక్ వంటి ప్రకృతి...

పామును చూస్తే చాలు అయ్యబాబోయ్ అంటూ ఇక్కడున్న వారు కూడా అంత దూరం పరుగులు తీస్తారు. కాని ప్రస్తుత కాలంలో డిస్కవరీ, నేషనల్ జాగ్రఫిక్ వంటి ప్రకృతి విజ్ఞాన చానెళ్ల వల్ల పాముల గురించి అవగాహన పెరిగింది. అయినప్పటికీ కొంత మంది ఇంకా పాములను చూస్తే చాలు భయంతో వణుకుతారు. మరి కొందరైతే పాము కనిపిస్తే చాలు అది ఎక్కడ వారిపై దాడి చేస్తుందో అని ముందే దాన్ని కొట్టి చంపేస్తారు.

అలా కొట్టి చంపడం తప్పని పాపం వారికి తెలీక చంపేస్తారు. పాము అంటే ఒకే జాతి అని, అన్నిటిలోనూ విషం ఉంటుందని ప్రజలు అనుకుంటారు. కొన్ని పాములలో మాత్రమే విషం ఉంటుందని గ్రహించలేరు. పాములు ఎవరినీ కావాలని పనికట్టుకుని వచ్చి కాటేయవు. వాటికి ఎక్కడ హాని కలుగుతుందో అని తొందరపడి కాటేస్తుంది. మరికొందరు పామును కొట్టినపుడు అది తప్పించుకుని పగబడతాయని అనుకుంటారు. కాని పాముకు ఎలాంటి పగలు ప్రతీకారాలు వుండవు. అది కేవలం మూఢనమ్మకం మాత్రమే. పాములు పగపడతాయన్న కథలు కేవలం సినిమాలలో మాత్రమే చూపిస్తారు. అది నిజ జీవితంలో ముమ్మాటికీ జరగదు. మనుషుల లాగానే పాములు కూడా ప్రాంతాలను బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకం వుంటాయి. భారత దేశంలో నాగు పాము, నల్లతాచు, అమెరికాలో ర్యాటిల్ స్నేక్ అని పిలిచే గజ్జెపాము ఉంటుంది. ఆఫ్రికాలో బ్లాక్ మాంబా పాములు ఉంటాయి. అలా భౌగోళిక స్థితిని బట్టి పాము జాతులు, జనాభా ఆధారపడి ఉంటాయి.

తెలుగు రాష్ట్రాల్లో పాములు రకాలు

నాగుపాము, రక్తపింజరి, కట్లపాము, నల్ల తాచు... ఇలా విషపూరిత పాములను వేళ్లమీద లెక్కించవచ్చు.

జర్రిగొడ్డు : తోకతో కొడితే ఆ వ్యక్తికి ఒళ్లంతా మంట పుడుతుందే తప్ప మరణించడు.

నాగుపాము: రెండు మీటర్ల పొడవు గలిగి గోధుమ లేదా నలుపు రంగులో తలపైన సున్నా వంటి గుర్తును కలిగిన వుంటాయి.

కట్లపాము: శిరిరం పైన షట్కోణాకృతిలో పొలుసులు ఉంటాయి. కట్లపాము నాగుపాము కంటే విషపూరితమైనది.

రక్తపింజర : పృష్ట తలంలో మూడు వరుసల డైమండ్ ఆకారపు మచ్చలు ఉంటాయి. తలపైన 'B' ఆకారమును కలిగి వెనుకకు తిరిగిన పొడవైన కోరలు ఉంటాయి.

రాచనాగు: అయిదు మీటర్ల పొడవు గిలిగా పసుపు లేదా నలుపు రంగులో ఉంటుంది.

విషరహిత సర్పాలు

పసరికి పాము ఆకు పచ్చ రంగును కలిగి ఎక్కువగా చెట్ల మీద సంచరిస్తూ ఉంటుంది.

గుడ్డి పాము వాన పామును పోలి ఉండును. దీని కళ్ళు పొలుసులతో కప్పబడి ఉంటాయి. ఇవి చదలను ఆహారంగా తీసుకొంటాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories