Cibil Score Misconceptions: సిబిల్ స్కోరుపై చాలా అపోహలు ఉన్నాయి.. వీటి గురించి మీకు తెలుసా..!

There Are Many Misconceptions About Cibil Score Know About Them
x

Cibil Score Misconceptions: సిబిల్ స్కోరుపై చాలా అపోహలు ఉన్నాయి.. వీటి గురించి మీకు తెలుసా..!

Highlights

Cibil Score Misconceptions: బ్యాంకులు కానీ ఫైనాన్షియల్ సంస్థలు కానీ లోన్ మంజూరు చేయాలంటే కచ్చితంగా సిబిల్ స్కోరు మెరుగ్గా ఉండాలి.

Cibil Score Misconceptions: బ్యాంకులు కానీ ఫైనాన్షియల్ సంస్థలు కానీ లోన్ మంజూరు చేయాలంటే కచ్చితంగా సిబిల్ స్కోరు మెరుగ్గా ఉండాలి. కానీ చాలామంది సిబిల్ స్కోరు విషయంలో కొన్ని అపోహలను నమ్ముతున్నారు. దీనిపై అవగహన కొరవడింది. అత్యవసర సమయంలో లోన్ కావాలంటే అందరూ చూసేది సిబిల్ స్కోర్ మాత్రమే కానీ దీనిని ఎలాంటి అంశాలు ప్రభావితం చేస్తాయో తెలిసి ఉండాలి. అలాగే సిబిల్ స్కోరు తక్కువగా ఉన్నా ఒకవేళ మొత్తమే లేకుండా లోన్ విషయంలో ఏం చేయాలనే విషయాలు ఈ రోజు తెలుసుకుందాం.

మీరు ఇప్పటి వరకు ఏ బ్యాంకు నుంచి ఫైనాన్షియల్ సంస్థ నుంచి లోన్, క్రెడిట్ కార్డు లాంటివి తీసుకోపోతే జీరో క్రెడిట్ ఉంటుంది. అయితే క్రెడిట్ హిస్టరీ లేకుండా బ్యాంకులు, ప్రైవేట్ సంస్థలు మీకు లోన్ ఇవ్వడానికి అంత తొందరగా ఓ నిర్ణయానికి రాలేకపోతారు. అత్యవసర సమయంలో దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే స్థిరమైన ఆదాయం మీరు లోన్ పొందే అవకాశాలను మెరుగు పరుస్తుంది. మీకు క్రెడిట్ స్కోర్ లేకున్నా మంచి ఆదాయం ఉంటే లోన్ మంజూరవుతుంది.

మీకు సిబిల్ స్కోరుపై ఒక అంచాన ఉంటేనే ఆర్థికంగా లోన్లు, క్రెడిట్ కార్డులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతిదీ సక్రమంగా ఉందో లేదో తెలుసుకోవడానికి ప్రతీ 2 నుంచి -3 నెలలకు ఒకసారి క్రెడిట్ రిపోర్ట్‌ను తనిఖీ చేస్తూ ఉండాలి. అయితే అది పనిగా క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తే క్రెడిట్ స్కోర్ దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ సిబిల్ స్కోరు ఉన్నప్పటికీ మీరు లోన్ పొందవచ్చు కానీ మీకు ఉండే ఆప్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీకు లోన్ ఇస్తారు కానీ మంచి సిబిల్ స్కోరు ఉన్నవారితో పోలిస్తే మీ వడ్డీ డబల్ ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories