RamSetu: రామేశ్వరంలో రాళ్లు తేలుతున్నాయి.. సైన్స్ ఈ మిస్టరీని చేధించగలదా?
RamSetu: రామసేతు భారతదేశం- శ్రీలంక మధ్య ఉన్న ఒక రహస్య నిర్మాణం. హిందూ మతంలో దీనిని రాముడి వానర సైన్యం నిర్మించిన అద్భుత వంతెనగా పరిగణిస్తుంటారు....
RamSetu: రామసేతు భారతదేశం- శ్రీలంక మధ్య ఉన్న ఒక రహస్య నిర్మాణం. హిందూ మతంలో దీనిని రాముడి వానర సైన్యం నిర్మించిన అద్భుత వంతెనగా పరిగణిస్తుంటారు. అయితే ఇది నిజంగా అద్భుతమా లేదా దీని వెనుక ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? రామసేతు సహజంగానే ఏర్పడిందా? లేక మానవ నిర్మితమా? అనే విషయాన్ని తేల్చే పనిలో శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి రామసేతు వార్తల్లోకి వచ్చింది. ఈసారి రామసేతులో రాళ్లు తేలుతుండటంతో..ఈ మిస్టరీని సైన్స్ ఛేదిస్తుందా అనే సందేహం అందరిలోనూ నెలకొంది.
నీళ్లపై తేలియాడే రాళ్లు..పునాది లేని వారధి. భారతదేశంలోని రామేశ్వరం నుంచి శ్రీలంక వరకు వంతెన..సున్నపురాయి..ఇసుకతో రామసేతు నిర్మాణం జరిగింది. ఇది రామయణ కాలంనాటిదని హిందువులు విశ్వసిస్తుంటారు. నారాయణుడే నురుడిగా వచ్చి ఈ వారధిని నిర్మించారని బలంగా నమ్ముతుంటారు. కానీ దీనిపై భిన్నాభిప్రాయాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ రామసేతుపై ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రామసేతులో రాళ్లు తేలుతున్నాయి. అయితే ఈ మిస్టరీని సైంటిస్టులు చేధిస్తారా అనే సందేహం నెలకొంది.
సముద్రంలో తేలియాడే.. రాళ్లు కనిపించే ప్రదేశం రామేశ్వరం. ప్రజలు దీనిని అద్భుతంగా భావిస్తారు. కానీ ఇది నిజంగా అద్భుతమా లేదా దీనికి ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? ఈ తేలియాడే రాళ్లు రామసేతుకు కనెక్ట్ అయ్యాయా లేదా అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. ఈ రాళ్లు నీటిలో ఎందుకు తేలుతాయోనని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. సైన్స్ ఈ రహస్యాన్ని వివరించగలదా? ఈ రాళ్లు ఎలా తేలుతాయో...దాని వెనుక కారణం ఏమిటో తెలుసుకుందాం.
రామాయణం ప్రకారం.. రావణుడు సీతను అపహరించినప్పుడు, రాముడు లంకపై దాడి చేయడానికి సముద్రం మధ్యలో ఒక వంతెనను నిర్మించాడు. ఈ వంతెన కేవలం 5 రోజుల్లో సిద్ధమయ్యింది. అయితే ఈ భారీ వంతెన నిర్మాణానికి ఎలాంటి రాళ్లను ఉపయోగించారనేది పెద్ద మిస్టరీగా మిగిలింది. మత విశ్వాసాల ప్రకారం, శ్రీరాముడు సముద్ర దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేశాడు. శ్రీరాముడి తపస్సును చూసి సంతోషించిన సముద్ర దేవుడు రాముడికోసం సముద్రంపై రాళ్ల వంతెనను నిర్మిస్తానని వరం ఇస్తాడు. రాముడు తన వానర సైన్యంతో కలిసి రాళ్లను సముద్రంలోకి విసిరాడు. ఆ రాళ్ళు నీటిలో తేలడం ప్రారంభించాయి. ఆ విధంగా వానర సైన్యంతో కలిసి రాముడు వంతెనను నిర్మిస్తాడు. ఈ వంతెన పై నుంచి రాముడు లంకకు చేరుకుంటాడు. ఇదంతా రామాయణంలో చాలా వివరంగా ఉంది.
అయితే సైన్స్ ఈ అద్భుతం వెనుక కొన్ని ఇతర కారణాలు ఉన్నాయని చెబుతుంది. రామసేతు నిర్మాణంలో 'ప్యూమిస్ స్టోన్' అనే ప్రత్యేక రాయిని ఉపయోగించారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ రాళ్ళు అగ్నిపర్వత లావా నుండి ఏర్పడతాయి. ఈ రాళ్లకు అనేక రంధ్రాలను కలిగి ఉంటాయి. ఈ రంధ్రాల కారణంగా, ఈ రాళ్ళు తేలికగా.. నీటిలో తేలుతూ ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నాసా ఉపగ్రహ సహాయంతో రామసేతుని చిత్రాలతో గుర్తించింది. అది మానవ నిర్మితమని ప్రకటించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మాట మార్చింది. మానవ నిర్మితమని చెప్పేందుకు ఎలాంటి ఆధారాల్లేవని కొట్టిపారేసింది. ఇసుక రేణువులతో సముద్రంలోకి వచ్చిన మార్పులతో వారధి ఏర్పడిందని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు రామసేతు రాళ్లు తేలుతుండటంతో మరోసారి రామసేతు వారధి తెరపైకి వచ్చింది.
గతంలో డిస్కవరి ఛానెల్ కూడా వాట్ ఆన్ ఎర్త్ పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. అయితే ఈ వంతెన మానవ నిర్మితమేనని ఆ ఛానెల్ వెల్లడించింది. ఇసుక తిన్నెలు సహజమైనవేనని రాళ్లు మాత్రం వేరొకచోట నుంచి తీసుకువచ్చారని డిస్కవరీ ఛానెల్ తేల్చింది. ఈ వంతెనను ప్రపంచవ్యాప్తంగా 'ఆడమ్స్ వంతెన' అని కూడా పిలుస్తారు. ఈ వంతెన భారతదేశంలోని రామేశ్వరం నుండి మొదలై శ్రీలంకలోని మన్నార్ వరకు ఉంటుంది. అయితే రామసేతు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. సైన్స్ , మతం రెండూ దాని గురించి వేర్వేరు వివరణలు ఉన్నాయి. ఈ వంతెన చరిత్ర, మతం విజ్ఞాన శాస్త్రాల ఏకైక సంగమం.
అయితే అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ 1 సర్కార్ నిర్మాణాన్ని ధ్వంసం చేసి సేతు సముద్రం షిప్ ఛానెల్ నిర్మించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. రామసేతు అడ్డుగా ఉండటం వల్ల భారత వాణిజ్య నౌకలు శ్రీలంకు చుట్టూ ప్రయాణించాల్సి వస్తుందని పేర్కొంది. దీనికి పరిష్కారం భారత ప్రభుత్వం జులై 2, 2005లో సేతు సముద్రం షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ అప్పట్లో అందోళనలు వెల్లువెత్తాయి. కొన్ని హిందూ సంఘాలు సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించాయి. దీంతో సేతు సముద్రం ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లదంటూ 2007 సుప్రీంకోర్టు స్టే విధించడంతో.దేశ ప్రయోజనాల మేరకు రామసేతుకు హాని కలిగించకుండా ఈ ప్రాజెక్టు చేపడామని అప్పట్లో అధికారంలో ఉన్న యూపీఏ1 ప్రభుత్వం చెప్పింది.
తాజాగా రామసేతు నిర్మాణానికి సంబంధించిన రాళ్లు మరోసారి నీటిపై కనిపిస్తుండటంతో ఈ వంతెన మరోసారి వార్తల్లోకి ఎక్కింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire