Playboy Tortoise : వందేళ్ల తాబేలు..800 తాబేళ్లకు తండ్రి అయింది.. వంశాన్ని బతికించింది!

Playboy Tortoise : వందేళ్ల తాబేలు..800 తాబేళ్లకు తండ్రి అయింది.. వంశాన్ని బతికించింది!
x
Diego Tortoise and his child (image screen shots from NC youtube channel)
Highlights

సాధారణంగా ఒక మగ తాబేలు తన జీవిత కాలంలో ఓ 20-30 వరకూ పిల్లలకు జన్మనిచ్చేలా సంతానోత్పత్తికి ఆడ తాబేలుకు సహకరించగలదు. ఎంత ఎక్కువ కాలం బ్రతికినా తన జీవిత...

సాధారణంగా ఒక మగ తాబేలు తన జీవిత కాలంలో ఓ 20-30 వరకూ పిల్లలకు జన్మనిచ్చేలా సంతానోత్పత్తికి ఆడ తాబేలుకు సహకరించగలదు. ఎంత ఎక్కువ కాలం బ్రతికినా తన జీవిత కాలంలో సంతానోత్పత్తికి సహకరించడం అనేది అంతే ఉంటుంది. కానీ, ఒక తాబేలు ఏకంగా 800 తాబేళ్ల పుట్టుకకు కారణం అయింది. ఈ బాహుబలి తాబేలు కథ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఈక్వెడార్‌లోని గాలాపాగోస్ ద్వీపాల్లో ఒకటైన శాంటా క్రూజ్ ద్వీపంలోని పార్కులో తాబేళ్ల పెంపకం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంతరించి పోతున్న అరుదైన తాబేళ్ల జాతులను బ్రతికించడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా 14 తాబేళ్లను ఎంపిక చేసుకున్నారు. వీటిలో ఓ తాబేలు రికార్డ్ స్థాయిలో తన సంతానాన్ని అభివృద్ధి చేసి చరిత్ర సృష్టించడమే కాకుండా.. తన జాతిని బ్రతికిన్చుకుంది. ఆ తాబేలు పేరు డియాగో.

1960 నుంచి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిన్స్తున్నారు. ఇప్పటివరకూ రెడువేల కంటే ఎక్కువ తాబేళ్లు ఇక్కడ పుట్టాయి. వాటి జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఇలా 800 తాబేళ్లకు తండ్రి అయింది మాత్రం డియాగో మాత్రమే.

విపరీతమైన సెక్స్ కోర్కెలు డియాగో కు ఉండడం వల్లే ఈ విధంగా అధిక సంఖ్యలో పిల్లలకు తండ్రి కాగలగిందని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. 800 తాబేళ్లను పుట్టించిన తరువాత ఆ డియాగో తాబేలు పని అక్కడ పూర్తయింది. దీంతో ఆ ప్లే బాయ్ తాబేలును తన స్వస్థలం ఎస్సన్సో ద్వీపానికి చేరుస్తున్నారు. ప్రస్తుతం అక్కడ 1800 తాబేళ్లు ఉన్నాయి. ఇప్పుడు వీటితో డియాగో కలిసిపోనుంది. అన్నట్టు అక్కడ ఉన్న 1800 తాబేళ్లలో 40 శాతం తాబేళ్లు డియాగో తాబేలు పిల్లలే అయివుండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఎస్పన్నోల ద్వీపంలో 50 ఏళ్ల కిందట రెండు మగ తాబేళ్లు, 12 ఆడ తాబేళ్లు మాత్రమే ఉండేవి. ఈ జాతి తాబేళ్లను కాపాడేందుకు డియాగోను, చెలొనొయిడిస్ హూడెన్సిస్ అనే మరొక తాబేలును కాలిఫోర్నియాలోని శాన్ డియాగో జూకు తీసుకెళ్లారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories