కిలో చెత్త తీసుకురండి.. భోజనం చేసి పొండి!

కిలో చెత్త తీసుకురండి.. భోజనం చేసి పొండి!
x
Highlights

వాళ్లక్కడ భోజనాన్ని వ్యర్థం చేయకండి అంటారు. కానీ, వ్యర్థాలు ఇస్తేనే భోజనం ఇస్తామంటారు. అర్థం కాలేదా? దేశంలోనే మొదటిసారిగా చెత్త తీసుకుని భోజనం పెట్టె...

వాళ్లక్కడ భోజనాన్ని వ్యర్థం చేయకండి అంటారు. కానీ, వ్యర్థాలు ఇస్తేనే భోజనం ఇస్తామంటారు. అర్థం కాలేదా? దేశంలోనే మొదటిసారిగా చెత్త తీసుకుని భోజనం పెట్టె కేఫ్ ప్రారంభించారు. అక్కడ కిలో చెత్త ఇస్తే భోజనం పెడతారు. అరకిలో చెత్త ఇస్తే టిఫిన్ ఇస్తారు. ఇదంతా కేవలం ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన కోసం ఇస్తున్న నజరానా మాత్ర మే.

ఎక్కడో తెలుసా.. ఛత్తీస్‌ గఢ్‌ రాష్ట్రంలోని అంబికాపూర్ మున్సిపాల్టీ అందిస్తున్న కొత్త పథకం ఇది. ఇక్కడ చెత్త తీసుకుని వస్తే వారికి ఆహారం ఇస్తామని వినూత్న ప్రయోగం చేపట్టారు. నిరాశ్రయులు ఎవరైనా కిలో చెత్తను తీసుకువస్తే వారికి భోజనం, అర కిలో చెత్త తెస్తే అల్పాహారాన్ని ప్రోత్సాహకంగా ఇస్తారు. దేశంలో మొదటి సారిగా ఇక్కడ గార్బేజ్‌ కేఫ్‌ను ఏర్పాటు చేశారు. ఇలా సేకరించిన చెత్తను, ప్లాస్టిక్‌ను రోడ్ల నిర్మాణానికి వినియోగిస్తారట. దేశంలోనే ఇండోర్ తర్వాత అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరొందిన అంబికాపూర్‌ మున్సిపాలిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ప్లాస్టిక్‌ సేకరించే వారికి ఇళ్లు కూడా నిర్మించే ఇచ్చే యోచనలో ఉన్నట్లు నగర మేయర్‌ అజయ్‌ తెలిపారు.

ఇక్కడ ఇప్పటికే ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్డు నిర్మించారు. దానికోసం 8 లక్షల ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడారట.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories