Indian CEO's: ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల సీఈవోలు మన భారతీయులే.. వీరి గురించి మీకు తెలుసా..?

The CEOs of the Largest Companies in the World are Indians Do You Know about Them | Telugu Online News
x

Indians CEO's: ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల సీఈవోలు మన భారతీయులే.. వీరి గురించి మీకు తెలుసా..?

Highlights

Indian CEO's: ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్...

Indian CEO's: ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. డోర్సే రాజీనామా తర్వాత కంపెనీ కొత్త CEO గా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్‌ను నియమించింది. కంపెనీ నిర్ణయం తర్వాత పరాగ్ ట్విట్టర్ CEO పదవిని చేపట్టారు. ట్విట్టర్ CEO కాకముందు పరాగ్ అగర్వాల్ కంపెనీలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO)గా పనిచేస్తున్నారు. 2011లో ఇంజనీర్‌గా ట్విట్టర్‌లో చేరారు. పరాగ్‌కు కంప్యూటర్ సైన్స్‌లో డాక్టరేట్ ఉంది. అతను IIT బాంబే నుంచి ఇంజనీరింగ్, కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి PhD చదివాడు.

ట్విట్టర్ కొత్త సీఈవోగా నియమితులైన పరాగ్ అగర్వాల్‌ను జాక్ డోర్సే ప్రశంసించారు. జాక్ మాట్లాడుతూ, "పరాగ్‌కు కంపెనీ CEOగా బాధ్యతలు చేపట్టే సామర్థ్యం ఉంది. గత 10 సంవత్సరాలుగా కంపెనీలో ఆయన చేసిన పని అపూర్వం. ఇప్పుడు అతను కంపెనీకి నాయకత్వం వహించాల్సిన సమయం ఆసన్నమైందని" డోర్సే చెప్పాడు. ట్విట్టర్ మాత్రమే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజన్ గూగుల్, టెక్నాలజీ కంపెనీ మైక్రోసాఫ్ట్, కంప్యూటర్ హార్డ్‌వేర్ కంపెనీ IBM, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ అడోబ్, ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ డెల్లాయిట్, కిరాణా దుకాణం కంపెనీ ఆల్బర్ట్‌సన్స్ కంపెనీలు సీఈవోలు కూడా భారతీయ సంతతికి చెందిన వారే కావడం గమనార్హం.

Google

ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్. సుందర్ పిచాయ్ 2015లో కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజినీరింగ్ చేసిన తర్వాత తదుపరి చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఆ తర్వాత 2004లో గూగుల్‌లో చేరారు.

మైక్రోసాఫ్ట్

ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో బిల్‌గెట్స్‌ ఒకరు. అయితే మైక్రోసాఫ్ట్ సీఈవో కూడా భారతీయ సంతతికి చెందిన సత్య నాదెళ్ల. ఈయన హైదరాబాద్‌లో జన్మించారు. 2014లో కంపెనీ సీఈవోగా నియమితులైన ఇప్పటికీ అదే పదవిలో కొనసాగుతున్నారు. సత్య నాయకత్వంలో మైక్రోసాఫ్ట్ అద్భుతమైన పురోగతిని సాధించడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories