Viral Video: అయ్యయ్యో పడిపోయారే..! పెళ్లిలో మీరెప్పుడైనా ఇలా చేశారా..?
Viral Video: వాహ సమయంలో జరిగే కొన్ని సంఘటనలు వధూవరులిద్దరికి కలకాలం గుర్తుండిపోతాయి.
Viral Video: వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన వేడుక. దీని కోసం యువతీ యువకులు చాలా కలలు కంటారు. ఆ సమయం వచ్చినప్పుడు ఎంతో సంబరపడిపోతారు. అందరిలో తమ వివాహం గుర్తుండిపోయే విధంగా జరుపుకోవాలనుకుంటారు. బంధువులు, స్నేహితులు, ఆత్మీయుల ఆశీస్సులతో కలకాలం ఉండాలనుకుంటారు. అయితే వివాహ సమయంలో జరిగే కొన్ని సంఘటనలు వధూవరులిద్దరికి కలకాలం గుర్తుండిపోతాయి. తాజాగా ఓ వివాహ వేడుకలో నవదంపతుల డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
ఈ వీడియోలో వధూవరులిద్దరు డ్యాన్స్ చేయడానికి ఉత్సాహంగా ఉన్నట్లు మనం వీడియోలో చూడవచ్చు. అయితే డ్యాన్స్ చేస్తూ చేస్తూ ఇద్దరు ఒక్కసారిగా కిందపడిపోవడం మనం వీడియోలో గమనించవచ్చు. ఈ సన్నివేశాన్ని చూసిన అతిథులు ఒక్కసారిగా నవ్వుతారు. అయ్యయ్యో పడిపోయారా అంటూ మళ్లీ చేయాలని కోరుతారు. అయితే ఆ నవజంట డ్యాన్స్ చేయడం కోసం ఎంత ఉత్సాహంగా ఉన్నారో మనం వీడియోలో తిలకించవచ్చు. అయితే తర్వాత ఏం జరిగిందో వీడియోలో స్పష్టంగా లేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియో హైటియన్‌బ్యూటీ 25 ఇన్‌స్టాగ్రామ్ పేజీ నుంచి షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది. నెటిజన్లు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. పదే పదే చూస్తూ నవ్వుతూ, షేర్స్, కామెంట్ చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా వివాహానికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వకుండా ఉండలేకపోతున్నారు. అయితే మీరు ఈ వీడియో చూసి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire