భారతదేశంలో ప్రముఖ మీడియా సంస్థలు : ఆధునిక జర్నలిజానికి వేదిక ఇండియా టుడే!

భారతదేశంలో ప్రముఖ మీడియా సంస్థలు : ఆధునిక జర్నలిజానికి వేదిక ఇండియా టుడే!
x
India today magazine cover images
Highlights

ఇండియా టుడే పత్రిక గురించి తెలియని పాఠకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. నాలుగున్నర దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా పాఠకులను ఆకట్టుకుంటూనే ఉంది ఇండియా టుడే...

ఇండియా టుడే పత్రిక గురించి తెలియని పాఠకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. నాలుగున్నర దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా పాఠకులను ఆకట్టుకుంటూనే ఉంది ఇండియా టుడే మ్యాగజైన్. భారత దేశంలో జర్నలిజం ఆధునిక పోకడలు సంతరించుకుంటున్న సమయంలో ఇండియా టుడే రంగ ప్రవేశం చేసింది. పక్ష పత్రికగా మొదలైన ఇండియా టుడే ఈరోజు ఇటు ప్రింట్ మీడియాలోనూ.. అటు డిజిటల్ మీడియాలోనూ దూసుకుపోతోంది.

ప్రస్తానం ఇదీ..

లివింగ్ మీడియా ఆధ్వర్యంలో డిసెంబర్ 1975 లో ఇండియా టుడే తొలి ముద్రణ ప్రారంభం అయింది. పక్ష పత్రికగా ఆంగ్లంలో ప్రారంభమైన ఇండియా టుడే ప్రస్తానం వేగంగా విస్తరించింది. ఆకట్టుకునే కథనాలు.. ఆధునిక శైలిలో సాగిన రచనలు.. ముఖ్యంగా మానవీయ కోణంలో ఆ పత్రిక అందించిన కథనాలు పత్రికను త్వరలోనే పాఠకులకు చేరువ చేశాయి. ఇంగ్లీష్ నుంచి హిందీకి.. అటుతర్వాత తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ ఇలా ప్రాంతీయ భాషల్లోనూ పత్రికను ప్రచురించడం ప్రారంభించారు. ఇండియా టుడే ఆధునిక జర్నలిజానికి వేదికగా నిలిచింది. ఇండియా టుడే శైలి అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా ఆ శైలిలో రాసేలా పలువురు జర్నలిస్టులకు స్ఫూర్తిగా నిలిచింది. పత్రిక ప్రింట్ క్వాలిటీ అప్పట్లో ఒక సంచలనం. పూర్తి రంగులతో దేశీయ, అంతర్జాతీయ విశేషాలను తనదైన శైలిలో పాఠకుల ముందు ఉంచడంలో ఇండియా టుడే ప్రత్యేకత కనబర్చింది.

ఎప్పటికప్పుడు మారుతూ..

పాఠకుల అభిరుచిలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ పత్రిక ముందుకు సాగుతూ వస్తోంది. ఇక ఆధునిక పోకడలు విపరీతంగా పెరిగిపోయి.. అరచేతిలో వార్తా ప్రపంచం కనిపిస్తున్న డిజిటల్ మీడియా యుగంలోనూ ఇండియా టుడే తన ముర్డను ప్రత్యేకంగా నిలుపుకుంటూ వస్తోంది. ఇండియా టుడే టెలివిజన్ రంగం లోనూ తనదైన ముద్ర వేస్తోంది. ఇండియా టుడే, ఆజ్ తక్ టీవీ చానెల్స్ జాతీయ స్థాయిలో చాలా ప్రభావ వంతంగా పనిచేస్తున్నాయి. అంతే కాకుండా ఇష్క్ పేరుతో ఎఫ్ ఎం రేడియో రంగంలోనూ ప్రత్యెక ముద్ర వేసింది ఇండియా టుడే.

ప్రస్తుతం ఇండియా టుడే గ్రూప్ చైర్మన్ గా అరుణ్ పూరియా ఉండగా.. సీఈవో గా వివేక్ ఖన్నా సేవలందిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories