Dream Means: తెల్లవారుజామున కలలో ఇవి కనిపిస్తే రాజయోగమే..!

Swapna Shastram if you see them in a Dream in the Early Morning it Means Good things will happen in the Future
x

Dream Means: తెల్లవారుజామున కలలో ఇవి కనిపిస్తే రాజయోగమే..!

Highlights

Dream Means: నిద్రపోయాక ప్రతి ఒక్కరికి కలలు వస్తుంటాయి. కానీ ఇందులో కొన్ని నిజ జీవిత్రాన్ని ప్రభావితం చేస్తాయి.

Dream Means: నిద్రపోయాక ప్రతి ఒక్కరికి కలలు వస్తుంటాయి. కానీ ఇందులో కొన్ని నిజ జీవిత్రాన్ని ప్రభావితం చేస్తాయి. ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ స్వప్నశాస్త్రం మాత్రం ఇదే చెబుతుంది. ముఖ్యంగా తెల్లవారు జామున వచ్చే కలలు కచ్చితంగా నిజం అవుతాయని చాలామంది నమ్మకం. స్వప్నశాస్త్రం అనేది నిద్రలో వచ్చే కలల గురించి వివరించే ఒక గ్రంథం. ఇందులో ప్రతీ కలకు ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. మనకి రకరకాల కలలు వస్తుంటాయి. అందులో పీడకలు, మంచి కలలు అన్ని ఉంటాయి. అయితే ఎలాంటి కలలు వస్తే మంచి జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం.

కలలో పండ్ల చెట్టు

వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తి కలలో పండ్లతో నిండిన చెట్టును చూస్తే అతను వ్యాపారంలో గొప్ప విజయాన్ని పొందబోతున్నాడని అర్థం. ఆ వ్యక్తి చాలా సంతోషాన్ని, సంపదను పొందబోతున్నాడని అర్థం. అతడు చేపట్టిన వ్యాపారం విజయవంతం అవుతుంది.

కలలో వర్షం

కలలో భారీ వర్షం పడుతున్నట్లు చూస్తే మీకు కొన్ని శుభాలు జరుగుతాయని అర్థం. లక్ష్మీ దేవి ఆశీస్సులు మీపై ఉన్నాయని చెప్పవచ్చు. త్వరలో ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో పెద్ద పురోగతిని పొందుతారు. కలలో నీరు కనిపిస్తే అది శుభ సంకేతంగా చెబుతారు.

కలలో పేదవారు

ఒక వ్యక్తి కలలో తనని తాను పేదవాడిగా మారడం చూస్తే త్వరలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అర్థం. అలాంటి కల వస్తే సంపద పెరుగుతుందని చెప్పవచ్చు. మీరు కలలో పేదవారు కావచ్చు కానీ నిజజీవితంలో డబ్బున్న వారిగా ఎదుగుతారు.

కలలో గులాబీ పువ్వు

స్వప్నశాస్త్రం ప్రకారం కలలో గులాబీ పువ్వు కనిపిస్తే అది శుభ సంకేతంగా చెబుతారు. ఈ రకమైన కల లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని సూచిస్తుంది. ఈ కల అర్థం త్వరలో మీ ఇంట్లో తెలుస్తుంది.

కలలో డబ్బు

కలలో డబ్బును చూడటం కూడా శుభసూచకమే. ఎవరికైనా కొత్త నోట్లు ఇస్తున్నట్లు కనిపిస్తే అది శుభప్రదంగా చెబుతారు. ఇలాంటి కల వచ్చినప్పుడు సమీప భవిష్యత్తులో ఆ వ్యక్తి అపారమైన సంపదను పొందుతాడని అర్థం. అతని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కనుమరుగవుతున్న నాణేలను చూడటం లేదా నాణేల శబ్దం వినడం కూడా ఆదాయంలో పెరుగుదలను సూచిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories