Viral Video: చెత్త నుంచి సెవన్ సీటర్ వాహనం.. ఈ కుర్రాడి టాలెంట్ కి ఎవరైనా ఫిదా కావాల్సిందే.. అబ్బురపరుస్తున్న వాహనం పై మీరూ ఓ లుక్కేయండి..

Solar Vehicle Made of Scrap Impresses Harish Goenka
x

Viral Video: చెత్త నుంచి సెవన్ సీటర్ వాహనం.. ఈ కుర్రాడి టాలెంట్ కి ఎవరైనా ఫిదా కావాల్సిందే.. అబ్బురపరుస్తున్న వాహనం పై మీరూ ఓ లుక్కేయండి..

Highlights

Viral Video: ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా తన సోషల్ మీడియా ఫ్యాన్స్ ను తెగ ఎంటర్ టైన్ చేస్తున్నారు.

Viral Video: ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా తన సోషల్ మీడియా ఫ్యాన్స్ ను తెగ ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఆయన పెట్టే పోస్టులు ఎంతో విభిన్నంగా, చాలా ఇంట్రెస్టింగ్ గానే కాకుండా చాలా స్ఫూర్తివంతంగా కూడా ఉంటాయి. దేశ విదేశాల్లోని వింతలు, విశేషాలు పోస్ట్ చేస్తూ హర్ష గోయెంకా నెటిజన్లను ఆకట్టుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఆ పోస్టుల కోసం నెటిజన్స్ ఎదురుచూస్తుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాను కుదిపేస్తోంది.

డిఫరెంట్ గా ఆలోచిస్తూ సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు వస్తున్న ఔత్సాహిక ప్రతిభావంతుల టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేస్తున్న హర్ష గోయెంకా తాజాగా ఓ వ్యక్తి ఆవిష్కరించిన సోలార్ వాహనాన్ని పరిచయం చేశారు. చెత్త నుండి సోలార్ వాహనాన్ని ఓ వ్యక్తి తయారు చేశాడు. ఈ వాహనంలో ఏడుగురు ప్రయాణం చేయగలగడం విశేషం.

ఈ వాహనం స్కూటర్ ను తలపించే విధంగా ఉంది. హర్ష గోయెంకా షేర్ చేసిన ఈ వీడియోలో సెవన్ సీటర్ వాహనాన్ని ఓ వ్యక్తి నడుపుతున్నట్లుగా ఉంది. వ్యర్థాల నుంచి ఈ వాహనాన్ని తయారు చేసినట్లు ఆ వ్యక్తి వివరిస్తున్నాడు. అలాగే ఈ వాహనం పై ఉన్న సోలార్ పేనళ్లు..అటు ఎండవేడి నుంచే కాదు వర్షం నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి. ఇలాంటి వినూత్న ఆలోచనలు మన భారత్ కే గర్వకారణమని కామెంట్ చేస్తూ హర్ష గోయెంకా వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పోస్ట్ చేసిన కొద్దిసేటపికే ట్రెమండస్ వ్యూస్ తో దూసుకెళ్లింది.

వినూత్న స్కూటర్ ను ఆవిష్కరించిన కుర్రాడిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని బడా కంపెనీలు అపాయింట్ చేసుకొని ఈ తరహా వాహనాలను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని తద్వారా గ్రామీణ ప్రాంతాలవాసులు వినియోగించేలా కృషి చేయాలని పలువురు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories