Viral Video: ఫోన్‌ చూస్తూ వంట చేస్తున్న మహిళ... చివరికి ఊహించని షాక్‌

Viral Video: ఫోన్‌ చూస్తూ వంట చేస్తున్న మహిళ... చివరికి ఊహించని షాక్‌
x
Highlights

Smartphone fell down in boiling oil: ఓ మహిళ కిచెన్‌లో ఏదో వంట చేస్తున్నారు. కిచెన్‌లో వేడి వేడి నూనెలో ఏదో డీప్‌ ఫ్రై వంటకం చేస్తున్నారు. ఓవైపు వంట చేస్తూనే మరోవైపు ఫోన్‌ను ఆపరేట్‌ చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా చేతిలోని ఫోన్‌ జారి వేడి వేడి నూనెలో పడిపోయింది.

Smartphone fell down in boiling oil: స్మార్ట్‌ఫోన్‌ వినియోగం ఎంతలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తిండి లేకపోయినా బతుకుతున్నారు కానీ, చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ లేకపోతే మాత్రం క్షణం గడవని పరిస్థితి నెలకొంది. ఉదయం నిద్ర లేవగానే మొదట చేసే పని ఫోన్‌ పట్టుకోవడం, రాత్రి పడుకునే ముందు చివరిగా చేసే పని కూడా ఫోన్‌ చూడడం. ఇలా రోజంతా ఫోన్‌తో కుస్తీలు పడుతున్నారు.

స్మార్ట్‌ ఫోన్‌ ప్రపంచాన్ని అరచేతిలో పెడుతుందనడంలో ఎంత నిజం ఉందో దాని వల్ల దుష్ప్రభావాలు కూడా అదే రేంజ్‌లో ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్మార్ట్ ఫోన్‌ను అధికంగా వినియోగించడం వల్ల మెడ నొప్పి మొదలు, కంటి సంబంధిత సమస్యల వరకు ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయని తెలిసిందే. ఇక స్మార్ట్ ఫోన్‌ పిచ్చిలో పడి కొందరు ప్రాణాల మీదికి తెచ్చుకున్న ఘటనలు కూడా అనేకం ఉన్నాయి.

ఇలాంటి సంఘటనలు నిత్యం సోషల్‌ మీడియా వేదికగా వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ షాకింగ్ ఘటన నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ కిచెన్‌లో ఏదో వంట చేస్తున్నారు. కిచెన్‌లో వేడి వేడి నూనెలో ఏదో డీప్‌ ఫ్రై వంటకం చేస్తున్నారు. ఓవైపు వంట చేస్తూనే మరోవైపు ఫోన్‌ను ఆపరేట్‌ చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా చేతిలోని ఫోన్‌ జారి వేడి వేడి నూనెలో పడిపోయింది. దీంతో ఒక్కసారిగా షాక్‌కి గురైన మహిళ చేతిలో ఉన్న వస్తువుతో ఫోన్‌ను బయటకు తీసింది.

అయితే ఆ ఫోన్ అప్పటికే వేడి వేడి నూనెలో ఫ్రై అయిపోయింది. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్‌ కావడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. డీప్‌ ఫ్రైడ్‌ స్మార్ట్ ఫోన్‌ రెసిపీ అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫోన్‌ పిచ్చి పడితే ఇలాగే ఉంటుంది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories