Indian Railways: ఈ రైలెక్కితే ఎటువంటి టికెట్‌ అవసరం లేదు.. ఉచిత ప్రయాణం..!

Single Train Which Does not Charge Fare People Traveling for Free
x

Indian Railways: ఈ రైలెక్కితే ఎటువంటి టికెట్‌ అవసరం లేదు.. ఉచిత ప్రయాణం..!

Highlights

Indian Railways: దేశంలో ప్రతిరోజూ లక్షల మంది ప్రజలు రైలులో ప్రయాణిస్తున్నారు. అయితే భారతదేశంలో ఒక రైలులో ప్రయాణించడానికి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

Indian Railways: దేశంలో ప్రతిరోజూ లక్షల మంది ప్రజలు రైలులో ప్రయాణిస్తున్నారు. అయితే భారతదేశంలో ఒక రైలులో ప్రయాణించడానికి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ప్రత్యేక రైలు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ సరిహద్దులో నడుస్తుంది. మీరు భాక్రా నంగల్ డ్యామ్ చూడటానికి వెళితే మీరు ఈ రైలులో ఉచితంగా ప్రయాణించి ఆనందించవచ్చు. వాస్తవానికి ఈ రైలు నాగల్ నుంచి భాక్రా డ్యామ్ మధ్య నడుస్తుంది. గత 73 ఏళ్లుగా మొత్తం 25 గ్రామాల ప్రజలు ఈ రైలులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు.

భాక్రా నంగల్‌ డ్యామ్‌ గురించి ప్రజలకు సమాచారం అందించేందుకు ఈ రైలును నడపడం గమనార్హం. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ డ్యామ్ కట్టడానికి ప్రజలు పడిన కష్టం అందరికి తెలియజేయడానికి దీనిని నడుపుతున్నారు. దీనిని భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డ్ నిర్వహిస్తుంది. ఈ రైల్వే ట్రాక్ పర్వతాలను బద్దలు కొట్టి తయారుచేశారు. ఈ రైలు 1949లో ప్రారంభమైంది. గత 73 సంవత్సరాలుగా ప్రజలు ఇందులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఈ రైలులో రోజుకు 25 గ్రామాల నుంచి 300 మంది ప్రయాణిస్తున్నారు.

ఈ రైలు వల్ల విద్యార్థులు ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు. రైలు నంగల్ నుంచి డ్యామ్ వరకు నడుస్తుంది. రోజుకు రెండుసార్లు ప్రయాణిస్తుంది. ఇందులో టీటీఈ ఉండరు. డీజిల్ ఇంజిన్‌తో నడిచే ఈ రైలు రోజుకు 50 లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తుంది. ఈ రైలు ఇంజిన్‌ను స్టార్ట్ చేసిన తర్వాత భాక్రా నుంచి తిరిగి వచ్చిన తర్వాత మాత్రమే ఆగిపోతుంది. ఈ రైలు నంగల్ నుంచి ఉదయం 7:05 గంటలకు బయలుదేరి ఉదయం 8:20 గంటలకు భాక్రా నంగల్‌కు తిరిగి వస్తుంది. తర్వాత మరోసారి మధ్యాహ్నం 3:05 గంటలకు నంగల్ నుంచి బయలుదేరి సాయంత్రం 4:20 గంటలకు భాక్రా డ్యాం చేరుకుంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories