Samsung Galaxy M51: 7000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 64 మెగా పిక్సెల్ కెమెరా.. వంటి అదిరే ప్యూచ‌ర్ల‌తో.. శాంసంగ్ నుండి మ‌రో స్మార్ట్ ఫోన్

Samsung Galaxy M51: 7000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 64 మెగా పిక్సెల్ కెమెరా.. వంటి అదిరే ప్యూచ‌ర్ల‌తో..  శాంసంగ్ నుండి మ‌రో స్మార్ట్ ఫోన్
x

Samsung Galaxy M51 With 7,000mAh Battery,  

Highlights

Samsung Galaxy M51: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ మ‌రో స్మార్ట్ ఫోన్ ను ప‌రిచ‌యం చేయ‌నున్న‌ది. అది కూడా మధ్య స్థాయి బడ్జెట్ లో అదిరిపోయే ప్యూచ‌ర్ల‌తో.. అదే శాంసంగ్ గెలాక్సీ ఎం51.. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు ఆన్ లైన్ లో లీకయ్యాయి.

Samsung Galaxy M51: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ మ‌రో స్మార్ట్ ఫోన్ ను ప‌రిచ‌యం చేయ‌నున్న‌ది. అది కూడా అదిరిపోయే ప్యూచ‌ర్ల‌తో.. మధ్య స్థాయి బడ్జెట్ లోనే.. అదే శాంసంగ్ గెలాక్సీ ఎం51.. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు ఆన్ లైన్ లో లీకయ్యాయి. ఓ సారి ఈ ఫోన్ స్పెసిఫికేష‌న్ల‌ను గ‌మ‌నిద్దాం.. 7000 ఎంఏహెచ్ కెపాసిటీ కలిగిన బ్యాటరీ ఈ ఫోన్ కు ప్ర‌ధాన ఆకర్ష‌ణ‌గా నిలువ‌నున్న‌ది. అంతేకాదు ఫోన్ వేగంగా ఛార్జింగ్ అవ్వడం కోసం 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కల్పించబడిన‌ట్టు తెలుస్తుంది.

అలాగే .. ఈ ఫోన్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 730 ప్రాసెసర్ పై పని చేయనుంది. ఈ ఫోన్ కు సంబంధించిన డిజైన్ మరియు కెమెరా స్పెసిఫికేషన్స్ Galaxy M31s మాదిరిగా ఉన్నప్పటికీ, ఈ ఫోన్ లో 6.7 అంగుళాల సూపర్ అమోల్డ్ ప్లేస్ డిస్ప్లే ఉంటుంది. హోల్ పంచ్ డిస్ ప్లే, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ కానుందని అమెజాన్ ఇప్పటికే టీజ్ చేసింది. ఈ ఫోన్ మనదేశంలో సెప్టెంబర్ రెండో వారంలో లాంచ్ కానుందని తెలిసింది. ఈ ఫోన్ మనదేశంలో రూ.30 వేల రేంజ్ లో ఉండే అవకాశంలో ఉండే అవకాశం ఉంది. ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. అది కూడా 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ తో రానున్నది. దీని సామ‌ర్థ్యం మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు.

మరో ప్ర‌ధాన ఆకర్ష‌ణ‌ కెమెరా.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ గా ఉంది. దీంతో పాటు 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, 5 మెగా పిక్సెల్ మాక్రో షూటర్ లు కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీల ల‌వ‌ర్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories