Vastu Tips: ఈ చర్యలతో ఇంట్లోని నెగిటివ్‌ ఎనర్జీని తొలగించండి.. పాజిటివ్‌ ఎనర్జీని ఆహ్వానించండి..!

Remove Negative Energy From Home With These Steps Invite Positive Energy
x

Vastu Tips: ఈ చర్యలతో ఇంట్లోని నెగిటివ్‌ ఎనర్జీని తొలగించండి.. పాజిటివ్‌ ఎనర్జీని ఆహ్వానించండి..!

Highlights

Vastu Tips: కొన్నిసార్లు కుటుంబంలో తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి.

Vastu Tips: కొన్నిసార్లు కుటుంబంలో తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య సంతోషం ఉండదు. అప్పుల భారం ఎక్కువవుతుంది. అనారోగ్యం బారిన పడుతుంటారు. నిజానికి ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ ఉండడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవు తుంటాయి. వాస్తు ప్రకారం కొన్ని పొరపాట్ల వల్ల ఇలా జరుగుతుంది. వాటిని గుర్తించి సరిచేయా లి. లేదంటే సమస్యలు పెరుగుతూ పోతాయి. ఈ రోజు అలాంటి వాటి గురించి తెలుసుకుందాం.

ఇంట్లో మరుగుదొడ్డిని తప్పు ప్రదేశంలో నిర్మించినట్లయితే మంచిదికాదు. టాయిలెట్‌లో ఉప్పు ను పెట్టడం వల్ల అక్కడ నుంచి నెగిటివ్‌ శక్తి తొలగిపోతుంది. అయితే ఉప్పు అనేది అక్కడ మాత్రమే ఉంచాలి. ఇంట్లో మరెక్కడా ఉంచకూడదని గుర్తుంచుకోండి. అలాగే ఇంటి నుంచి నెగిటివ్‌ శక్తిని తొలగించడానికి కనీసం వారానికి ఒకసారి ఉప్పునీటితో ఇళ్లు తుడవాలి. ఇది నెగిటివ్‌ ఎనర్జీని తొలగిస్తుంది. ఇంట్లోకి పాజిటివ్‌ ఎనర్జీని తీసుకొస్తుంది.

ఇంట్లో ఉండే అన్ని గడియారాలు ఎప్పుడు నడుస్తూ ఉండాలి. అవి ఆగిపోతే వెంటనే రిపేర్‌ చేయించాలి. ఏ సందర్భంలోనూ గడియారం ఆగకూడదు. నడుస్తున్న గడియారం డబ్బుకు చిహ్నం అని గుర్తుంచుకోండి. విరిగిన కుర్చీలు, ఖాళీ పెట్టెలు, సీసాలు, విగ్రహాలు, మరేదైనా చెత్త ఇంటి పైకప్పుపై ఉంచకూడదు. సాలెపురుగులు ఇరుక్కుపోకుండా, నేలపై నాచు అంటుకోకుండా ఉండేలా పైకప్పులు, మూలలను శుభ్రం చేయాలి.

ఇంటి గోడలు, నేలపై పెన్సిల్, సుద్ద గుర్తులుంటే వాటిని చెరిపేయాలి. ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ ప్రసరించడానికి పసుపు, బియ్యాన్ని మెత్తగా రుబ్బి దీంతో ఇంటి ప్రవేశద్వారం వద్ద ఓం రాయా లి. ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, శుభ్రమైన దుస్తులు ధరించి పూజ గదిలో దీపం, అగరబత్తీలు వెలిగించాలి. వీలైతే తాజా పుష్పాలను సమర్పించాలి. తప్పుడు మాటలు ఎప్పుడూ మాట్లాడకూడదు.

Show Full Article
Print Article
Next Story
More Stories