Viral Video: కెమెరా కంటికి చిక్కిన అరుదైన నల్ల చిరుత.. వైరల్‌ అవుతోన్న వీడియో..!

Rare Black Leopard Found in Odisha Forest Viral Video
x

Viral Video: కెమెరా కంటికి చిక్కిన అరుదైన నల్ల చిరుత.. వైరల్‌ అవుతోన్న వీడియో..!

Highlights

Viral Video: ఈ భూమ్మీద ఎన్నో కోట్ల జీవులు ఉన్నాయి. వీటిలో చాలా వరకు మనకు తెలియనవి కూడా ఉన్నాయి.

Viral Video: ఈ భూమ్మీద ఎన్నో కోట్ల జీవులు ఉన్నాయి. వీటిలో చాలా వరకు మనకు తెలియనవి కూడా ఉన్నాయి. అయితే గతంలో ఉనికిలో ఉండి ఇప్పుడు అంతరించిపోతున్న జాతులు కూడా ఎన్నో. అలాంటి అంతరించిపోతున్న అరుదైన జీవులు అప్పుడప్పుడు కనిపిస్తూ జంతు ప్రేమికులను ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. తాజాగా అలాంటి ఓ అరుదైన జీవి కెమెరా కంటికి చిక్కింది.

ఒడిశాలోని నయాగఢ్‌ అడవి ఈ అరుదైన దృశ్యానికి సాక్ష్యంగా నిలిచింది. సాధారణంగా చిరుతపులులు చారలతో ఉంటాయి. అయితే పూర్తిగా నల్లగా ఉండే చిరుతలు చాలా అరుదని తెలిసిందే. ఇలాంటి కేవలం సినిమాల్లో గ్రాఫిక్స్‌లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే ఇలాంటి అరుదైన చిరుత ఒకటి తాజాగా ప్రత్యక్షమైంది. ఒడిశాలోని నయాగఢ్‌ అడవుల్లో అరుదైన మెలానిస్టిక్‌ చిరుతపులి కనిపించింది.

నోట్లో కూనను పట్టుకుని తిరుగుతున్న నల్ల చిరుత కెమెరాకు చిక్కింది. అడవిలో ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరాల్లో చిరుతపులి కదలికలను గుర్తించామని ప్రినిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ప్రేమ్‌ కుమార్‌ జా తెలిపారు. సెంట్రల్‌ ఒడిశాలో ఈ అరుదైన నల్ల చిరుత కనిపించిందని అధికారులు తెలిపారు. దీంతో పాటు ఓ పిల్ల కూడా ఉందని గుర్తించారు. ఈ పులి సంచారం ఈ ప్రాంత అద్భుతమైన జీవవైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందని చెబుతున్నారు. పర్యావరణ వ్యవస్థకు నల్ల చిరుతలు చాలా ముఖ్యమైనవని, వాటి ఆవాసాలను రక్షించడమనేది అభివృద్ధి చెందుతున్న వన్యప్రాణుల వారసత్వాన్ని నిర్ధారిస్తుందని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఇలాంఇ అరుదైన నల్ల పులి కనిపించడంతో జంతు ప్రేమికులు హ్యాపీగా ఫీలవుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories