ప్రాచీన కాలానికి చెందిన ఓ చదరంగం పావు.. లండన్‌లో జరిగిన వేలంపాటలో ఏకంగా రూ. 6.3 కోట్లకు అమ్ముడుపోయింది. సుమారు 900 ఏళ్ల కిందటి లెవిస్ చెస్‌మ్యాన్...
ప్రాచీన కాలానికి చెందిన ఓ చదరంగం పావు.. లండన్‌లో జరిగిన వేలంపాటలో ఏకంగా రూ. 6.3 కోట్లకు అమ్ముడుపోయింది. సుమారు 900 ఏళ్ల కిందటి లెవిస్ చెస్‌మ్యాన్ పావును 1964లో ఓ వ్యక్తి కేవలం ఐదు పౌండ్ల (రూ. 430)కి కొనుగోలు చేశాడు. లండన్ సౌత్‌బైలో మంగళవారం జరిగిన వేలంపాటలో ఓ గుర్తుతెలియని బిడ్డర్ ఈ పావును 7.35 లక్షల పౌండ్ల (రూ. 6.3 కోట్ల)కు సొంతం చేసుకున్నాడు. సైనిక యోధుడి రూపంలో ఉన్న ఈ పావు 8.8 సెంటీమీటర్ల పొడవు ఉంది. 12వ శతాబ్దానికి చెందిన వార్లస్ అనే సముద్ర జంతువు దంతంతో ఈ పావును తయారు చేశారు. నార్సె యోధుల రూపంలో లెవిస్ చెస్‌మ్యేన్ పావులు ఉంటాయి. యూరోపియన్ చరిత్రలో వైకింగ్ శకానికి (క్రీ.శ. 800 నుంచి 1066 మధ్యకాలం) చెందిన ఈ కాలపు కళాకృతులు ఎంతో విశిష్టమైనవి. వీటికి మార్కెట్‌లో గొప్ప ధర పలుకుతుంది.
రూర్క్ (చదరంగంలో ఏనుగు)ను తలపిస్తున్న ఈ పావును స్కాటిష్ ప్రాచీన కళాకృతుల డీలర్ వద్ద మొదట కనుగొన్నారు. ఇలాంటి చదరంగం పావులు 1831లో స్కాట్లాండ్‌లోని ఇస్లే ఆఫ్ లెవిస్‌లో పెద్ద ఎత్తున లభించాయి. మొత్తం ఐదు సెట్ల చెస్ పావులు అక్కడ దొరికాయి. వాటి నుంచి అదృశ్యమైన ఈ చెస్‌పావు.. కాలక్రమంలో అనేకమంది చేతులు మారుతూ.. చివరకు గత మంగళవారం లండన్‌లో వేలంపాటకు వచ్చినట్టు భావిస్తున్నారు. 1964లో ఎడిన్‌బర్గ్‌కు చెందిన డీలర్ తమ నుంచి ఈ చెస్ పావును రూ. 430కి కొనుగోలు చేసినట్టు స్కాటిష్ డీలర్ కుటుంబం ప్రతినిధి తాజాగా మీడియాకు తెలిపారు.
Bestselling author Lars Mytting explains how a chesspiece being sold in our Old Master Sculpture & Works of Art sale provides clues to a curious Norse legacy.#SothebysSculpture https://t.co/7KHncmqsK4
— Sotheby's (@Sothebys) June 27, 2019
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire