వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి...

వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి...
x
Highlights

ఎండాకాలం ప్రారంభం అయిన రోజు నుంచే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది.

ఎండాకాలం ప్రారంభం అయిన రోజు నుంచే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. తెల్లవారిన కాసేపటికే సూర్యుడు భగ భగ మంటూ వచ్చేస్తున్నాడు. ఉదయం 7.30, 8 గంటల సమయం నుంచే వేడి వాతావరణం కనపడుతుంది. గత రెండు మూడు రోజులుగా అయితే ఉష్ణోగ్రతలు మరీ పెరిగిపోతున్నాయి. సుమారుగా 45 డిగ్రీల నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంతే కాక వడగాలులు, ఈదురుగాలులు ఎక్కువగా వీస్తున్నాయి. ఈ గాలులకు, ఎండ వేడికి చిన్న పిల్లలు, ముసలి వారు తట్టుకోలేకపోతున్నారు. దీంతో వారికి ఎండదెబ్బ కూడా తాకే అవకాశం ఉంటుంది. ఈ వేసవి నుంచి ఉపశమనం పొందాలంటే తగిన జాగ్రత్తలు పాటించాలంటున్నారు వైద్యులు. లేదంటే తలనొప్పి, ఒళ్లుమంట, డీ హైడ్రేషన్ లాంటి సమస్యలు వెంటాడుతాయని హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తలు పాటించకపోతే కొన్ని సమయాల్లో ఎండ వేడిమిని తట్టుకోలేక కొంత మంది ప్రాణాలను కూడా కోల్పోతుంటారు.

వేసవికాలంలో శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగిపోవటం వలన వడ దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఈ వడదెబ్బల వలన భౌతికంగా మాత్రమె కాకుండా, శరీరంలో వివిధ రకాల అవయవాలు, అవయవ వ్యవస్థలు, వాటి విధులు, ముఖ్యంగా నాడీ వ్యవస్థ ప్రమాదానికి గురవుతుంది. ఇతర ఉష్ణ అనారోగ్యం (హైపెర్థెర్మియా రూపాలు) వేడి తిమ్మిరి, వేడి అలసటలు కలుగుతాయి. చిన్న పిల్లలో మాత్రమె కాకుండా వయసు మీరిన వాళ్ళలో గుండెపోటు వంటి వాటిని కుడా కలిగిస్తుంది.

వేడిని తట్టుకునేందుకు కొన్ని జాగ్రత్తలు

ఇంట్లో వాతావరణం చల్లగా ఉండే విధంగా చూసుకోవాలి.

పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది.

ముఖ్యంగా పసి పిల్లలపై ఎండ ప్రభావం పడకుండా చూసుకోవాలి.

చిన్న పిల్లలకు తల్లి పాలు తప్పనిసరిగా పట్టించాలి.

ఉదయం 8 గంటలలోపే పిల్లలకు స్నానాలు ముగించాలి.

పలుచని బట్టలు వేయాలి.

ఎండలో ప్రయాణించే వారు గొడుగు, హెల్మెట్, గ్లౌజ్‌లు వాడాలి.

రోజుకు కనీసం నాలుగు లీటర్ల మంచినీరు తప్పక తీసుకోవాలి.

ఎండలోకి వెళ్లేవారు సన్‌స్క్రీన్ లోషన్స్ తప్పనిసరిగా వాడాలి.

ఒంటికి వదులుగా ఉండే దుస్తులు ధరించాలి.

వేసవిలో అనారోగ్యం పాలు కాకుండా తీసుకునే జాగ్రత్తలు...

తీసుకునే ఆహారంలో తగినంత ఉప్పు, నీరు, పోషక విలువలు ఉండేవిధంగా చూసుకోవాలి.

ఎండలో బయటికి వెళ్లే సమయంలో కళ్లద్దాలు సన్‌వూస్కీన్‌లోషన్లు వాడాలి.

గది చుట్టూ చల్లటి గుడ్డలు వేలాడదీయాలి. రెండు పూటల స్నానం చేయించాలి.

పళ్ళు, కూరగాయలు ఎక్కువగా తినిపించాలి. మసాలాలు తగ్గించాలి.

పలుచటి, మెత్తటి కాటన్‌బట్టలు తొడగాలి. బయటికి వెళ్తే గొడుగు, టోపీ వాడాలి.

దోమలు కుట్టకుండా రాత్రి పూట పైజామా లాల్చీ లాంటి బట్టలు తొడగాలి.

బయటి ఆహారం తినిపించకూడదు. తాజా ఆహారం మాత్రమే పెట్టాలి.

బయటకి వెళ్ళాలంటే సరైన సమయాలు ఎంచుకోవాలి. ఆటలు, ఈత నేర్పించాలంటే తెల్లవారుజామునే వెళ్లి ఎండ ముదరక ముందే ఇంటికి చేరుకోవాలి.

టీకాలన్నీ సకాలంలో వేయించి, టీకాలతో నివారించగల వ్యాధులన్నిటినీ నిరోధించాలి.

తాతలు, అవ్వలతో గడపడానికి పల్లెలకి వెళ్ళినప్పుడు జాగ్రత్తలు పాటించాలి.

వేసవిలో చర్మ సంరక్షణ...

రోజంతా చర్మం పై తేమ ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం వాటర్ కలిసిన మాయిశ్చరైజింగ్ క్రీమును, రోజ్ వాటర్‌ను రాసుకుంటే మంచిది.

రోజుకు వీలైనన్ని సార్లు చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.

చర్మం బాగా పొడిబారిపోయినప్పుడు సబ్బుతో ఎక్కువ సార్లు ముఖం కడుక్కోవద్దు.

నీటిని ఎక్కువగా తాగాలి.

చర్మం మీద సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల పడకుండా చూసుకోవాలి.

పల్చటి కాటన్ వస్త్రాలు, ముఖ్యంగా లైట్‌కలర్స్ ధరించడం మేలు.

చేతులను కప్పివేసే షర్టులను ధరించండి.

తలకు టోపి పెట్టుకోవడం లేదా గొడుగు వాడడం వల్ల సూర్యకిరణాల నుంచి రక్షణ లభిస్తుంది.

తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని కొంచెం కొంచెంగా తీసుకోవాలి.

పుచ్చకాయ, ద్రాక్ష, కర్భూజ లాంటి పండ్లరసాలను, చల్లని మజ్జిగ, కొబ్బరి నీరు తాగడం మరింత మంచిది.

కీరదోస, క్యారట్, బీట్‌రూట్ లాంటి పచ్చికూరగాయలను తీసుకోవాలి.

ఎండలోంచి నీడకు వెళ్లిన వెంటనే ముఖం కడుక్కోకుండా, కొంచెం సేపు ఆగి కడుక్కోవాలి.

ఐస్‌తో ముఖంపై మర్దన చేసుకుంటే చర్మం మరింత తాజాదనం సంతరించుకుంటుంది.

స్క్రబ్బర్‌లను ఉపయోగించకండి.

టమాటా, నిమ్మరసంతో ముఖానికి ప్యాక్ వేసుకుంటే చర్మంపై జిడ్డు పూర్తిగా వదిలిపోతుంది.

వేసవి కాలంలో వడదెబ్బను నివారించేందుకు మార్గాలు

వేసవికాలంలో భయటకి వెళ్ళేటపుడు మీతో వాటర్ బాటిల్'ను తీసుకెళ్ళండి.

ఎండలో భయటకి వెళ్ళినపుడు చల్లటి ప్రదేశాలలో ఉండటానికి ప్రయత్నించండి.

వేసవికాలంలో ఆల్కహాల్, సిగరెట్, కెఫీన్ వంటి వాటికి దూరంగా ఉండండి.

డోకులు, వాంతులు, అలసట, తలనొప్పి వంటివి రాకుండా చూసుకోవాలి.

వేసవికాలంలో మీ శరీర ఉష్ణోగ్రతలు పెరిగినట్లు గమనించినట్లయితే వెంటనే ఆరోగ్య నిపుణులను సందర్శించి సరైన జాగ్రత్తలను తీసుకోండి.

సూర్యరశ్మికి బహిర్గతమైనపుడు సోడియం వంటి ఎలక్ట్రోలైట్ వంటి ద్రావణాలను త్రాగటం చాలా మంచిది.

వేసవిలో వచ్చే ఇన్‌ఫెక్షన్లు...

చలి తగ్గి ఎండలు ముదరక ముందే ఆటలమ్మ ఆడాపాడే పిల్లల మీమద దాడి చేస్తోంది. అది ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది.

గవద బిళ్ళలు, టైఫాయిడ్‌, పొంగు, హైపటైటిస్‌ 'ఎ' కామెర్లు కూడా ఎండాకాలం బాగా వ్యాపిస్తాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories