Photo Puzzle: ఈ ఫొటోలో మూడు తప్పులున్నాయి.. కనిపెట్టగలరా?

Photo Puzzle: ఈ ఫొటోలో మూడు తప్పులున్నాయి.. కనిపెట్టగలరా?
x
Highlights

Photo Illusions: సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆప్టికల్‌ ఇల్యూజన్‌తో పాటు ఫొటో పజిల్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. మన ఐక్యూతో పాటు కంటి...

Photo Illusions: సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆప్టికల్‌ ఇల్యూజన్‌తో పాటు ఫొటో పజిల్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. మన ఐక్యూతో పాటు కంటి పవర్‌ను పరీక్షించే ఈ ఫొటోలు నిత్యం ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇలాంటి ఫొటో పజిల్స్‌ను సాల్వ్‌ చేసే క్రమంలో వచ్చే ఆనందమే వేరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే సోషల్‌ మీడియాలో వీటి కోసం ప్రత్యేకంగా పేజీలను క్రియేట్‌ చేస్తున్నారు.


తాజాగా ఇలాంటి ఓ ఫొటో పజిల్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఏంటా ఫొటో.? అందులో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. పైన ఉన్న ఫొటో చూడగానే ఓ యువతి హాల్‌లో కూర్చొని ఏదో పుస్తకం చదువుతున్నట్లు కనిపిస్తోంది కదూ! అయితే ఈ ఫొటోలో 3 తప్పులు ఉన్నాయి. వాటిని గుర్తించడమే ఈ ఫొటో పజిల్ ముఖ్య ఉద్దేశం. ఇంతకీ ఆ మూడు తప్పులు ఏంటో గుర్తించారా.?

ఒకసారి ఫొటోలో ఉన్న అన్ని వస్తువులను జాగ్రత్తగా గమనిస్తే సమాధానం ఇట్టే గుర్తించవచ్చు. మరి కంటి చూపుతో పాటు మెదడుకు పనిచేప్పే ఈ పజిల్‌ను మీరు సాల్వ్‌ చేశారా? ఏంటి ఎంత ప్రయత్నించినా పజిల్‌ను సాల్వ్‌ చేయలేకపోతున్నారా? కేవలం 10 సెకండ్లలో పజిల్‌ను సాల్వ్‌ చేస్తే మీ ఐ పవర్ సూపర్ అని అనుకోవాల్సిందే.


ఇక సమాధానం విషయానికొస్తే.. ఈ ఫొటోలో మొత్తం మూడు తప్పులు ఉన్నాయి. ఒకటి ఆ యువతి ధరించిన చెప్పులు రెండు వేరువేరుగా ఉన్నాయి. అదే విధంగా క్యాలెండర్‌లో జూన్‌ నెల కనిపిస్తోంది. అయితే జూన్‌ నెలలో 31 రోజులు ఉండవు. ఇక మూడో తప్పు విషయానికొస్తే.. యువతి పైన ఉన్న గడియారంలో అంకెలు రివర్స్‌లో ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories