Optical Illusion: ఈ ఫొటోలో పిల్లి దాగుంది కనిపెట్టగలరా.? గుర్తిస్తే మీరు తోపులు.. !

Optical Illusion Can You Find There is Cat in This Photo
x

Optical Illusion: ఈ ఫొటోలో పిల్లి దాగుంది కనిపెట్టగలరా.? గుర్తిస్తే మీరు తోపులు.. !

Highlights

Optical Illusion: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటోలకు క్రేజ్‌ పెరిగింది.

Optical Illusion: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటోలకు క్రేజ్‌ పెరిగింది. ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటోలు చూసే కళ్లను మాయ చేస్తే, విజువల్‌ ఆప్టికల్స్‌ మెదడును కన్ఫ్యూజ్‌ చేస్తున్నాయి. ఇక ఇలాంటి పజిల్స్‌ను సాల్వ్‌ చేయడంలో ఉండే కిక్కు కూడా మాములుగా ఉండదు. అందుకే వీటికి ఆదరణ బాగా పెరుగుతోంది.

ముఖ్యంగా చూసే కళ్లను సైతం మాయ చేసే ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఫొటోలో దాగి ఉన్న ఆబ్జెక్ట్స్‌ను కనిపెట్టగలరా.? అంటూ ఛాలెంజ్‌ విసురుతున్నారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా సైట్స్‌లో ప్రత్యేకంగా పేజీలను క్రియేట్ చేసి మరీ ఇలాంటి ఫొటోలను పోస్ట్‌ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఏంటా ఫొటో.? అందులో ఉన్న మ్యాజిక్‌ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్ళాల్సిందే..

పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే ఏం కనిపిస్తోంది.? ఏముంది ఓ గదిలో షెల్ఫ్‌ అందులో పాత పుస్తకాలు ఉన్నాయి. అంటారు కదూ! అయితే ఇదే ఫొటోలో ఓ పిల్లి దాగి ఉంది. ఎప్పుడు వెళ్లిందో ఎలా వెళ్లిందో తెలియదు కానీ.. నక్కి నక్కి చూస్తోంది. ఫొటోగ్రాఫర్‌ పిల్లి ఉందన్న విషయం తెలిసి తీశాడో, తెలియక తీశాడో కానీ ఇప్పుడు ఈ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇంతకీ మీరు ఆ పిల్లిని కనిపెట్టారా.? ఓసారి ట్రై చేయండి.

ఏంటి ఎంత ట్రై చేసినా పిల్లిని కనిపెట్టలేకపోతున్నారా.? అయితే ఓసారి ఫొటోలో ఉన్న షెల్ఫ్‌లను జాగ్రత్తగా గమనించండి అందులోనే పిల్లి నక్కి చూస్తోంది. కుడివైపు నుంచి రెండో రాక్‌లో పిల్లి ఉంది. ఇన్ని క్లూస్‌ ఇచ్చినా పిల్లిని కనిపెట్టలేకపోయారా.? అయితే సమాధానం కోసం ఓసారి కింద ఫొటో చూడండి.



Show Full Article
Print Article
Next Story
More Stories