Nita Ambani Gown Cost: న్యూ ఇయర్ పార్టీకి నీతా అంబానీ ధరించిన డ్రెస్ ధర ఎంతో తెలుసా?

Nita Ambani Gown Cost: న్యూ ఇయర్ పార్టీకి నీతా అంబానీ ధరించిన డ్రెస్ ధర ఎంతో తెలుసా?
x
Highlights

Nita Ambani Gown Cost: న్యూ ఇయర్ వేడుకల్లో నీతా అంబానీ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన న్యూ...

Nita Ambani Gown Cost: న్యూ ఇయర్ వేడుకల్లో నీతా అంబానీ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన న్యూ ఇయర్ పార్టీ వేడుకల్లో నీతా అంబానీ మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరిని ఆకట్టుకున్నారు. దీంతో నీతా ధరించిన గౌన్ ధర ఎంత అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ స్టైల్, ఫ్యాషన్ పరంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. తన ఫ్యాషన్, అందంతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. 60 ఏళ్ల వయస్సులోనూ ఆమె ఫ్యాషన్ సెన్స్‌తో అవాక్కయేలా చేస్తుంటారు. నేటి తరానికి ఆమె కాంపిటీషన్ ఇచ్చేలా అందంగా ముస్తాబవుతుంటారు. ఏ పార్టీ నిర్వహించినా... అందరీ చూపు ఆమె వస్త్రాలంకరణ పైనే ఉంటుంది. రీసెంట్‌గా తన ఫ్యామిలీ, క్లోజ్ ఫ్రెండ్స్‌తో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్న నీతా తన గ్లామర్ లుక్‌తో అందరినీ అలరించారు.

ఈ పార్టీలో నీతా డిజైనర్ లేబుల్ ఆస్కార్ డి లా రెంటా నుంచి బంగారు రంగులో మెరిసే కఫ్తాన్ స్టైల్ లాంగ్ ఫ్రాక్ ధరించారు. లామో ఫ్యాబ్రిక్‌తో తయారు చేసిన ఈ గౌను ధర రూ.1.54 లక్షలు ఉన్నట్టు తెలుస్తోంది. నీతా సింపుల్ లుక్‌లో కూడా రిచ్‌గా కనిపించారు. ఐవరీ నెక్‌లైన్, స్లీవ్ ఏరియాలో అందమైన క్రిస్టల్ వర్క్‌తో సింపుల్ గౌన్‌కు కాస్ట్లీ టచ్ అందించారు. డైమండ్ డ్రాప్ చెవిపోగులు, ఉంగరం నీతా అంబానీ అందాన్ని మరింత పెంచాయి. వీటితో పాటు మెరిసే హీల్స్ పర్ఫెక్ట్‌ మ్యాచ్‌గా కనిపించాయి.

నీతా అంబానీ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రాచీన కళలకు, సంస్కృతులకు పెద్ద పీట వేస్తున్నారు. అనేక మంది కళాకారులను ఎన్‌ఎంఏసీసీ ద్వారా ఆదరిస్తున్నారు. నీతా అంబానీ ఫ్యాషన్ ఐకాన్ అని అందరికీ తెలిసిందే. చేనేత చీరలు, ఖరీదైన పట్టుచీరలు, విలువైన డైమండ్ ఆభరణాలు, లగ్జరీ పాదరక్షలు, ఇలా ఒకటేమిటి ప్రతి విషయంలోనూ తనదైన శైలితో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. తాజాగా జరిగిన న్యూఇయర్ వేడుకల్లో మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ వేడుకల్లో అనంత్, ఆకాష్ అంబానీ జంటలు అందంగా కనిపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories