Indian Railways: రెండు ప్లాట్ ఫారమ్‌ల మధ్య దూరం 2 కిలోమీటర్లు.. ఈ స్పెషల్ రైల్వే స్టేషన్ ఎక్కడుందో తెలుసా?

New Barauni Railway Station Platform 1 and 2 Distance is Two Kilometers
x

Indian Railways: రెండు ప్లాట్ ఫారమ్‌ల మధ్య దూరం 2 కిలోమీటర్లు.. ఈ స్పెషల్ రైల్వే స్టేషన్ ఎక్కడుందో తెలుసా?

Highlights

Indian Railways: ఇప్పటి వరకు మీరు చాలా ప్రత్యేకమైన రైల్వే స్టేషన్ల గురించి వినే ఉంటారు. కానీ, ఓ స్టేషన్‌లో రెండు ప్లాట్‌ఫారమ్‌ల మధ్య దూరం 2 కిలోమీటర్లు అని మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ స్టేషన్ దేశంలోని ఏ నగరంలో ఉందో తెలుసా?

Indian Railways: భారతదేశంలో ఎవరైనా ఎక్కువ దూరం ప్రయాణించవలసి వస్తే. ముందుగా గుర్తుకు వచ్చేది భారతీయ రైల్వే. భారతీయ రైల్వేల నెట్‌వర్క్ ఆసియాలోనే అతిపెద్దది. ఇది ప్రపంచంలోనే నాలుగవ స్థానంలో ఉంది. భారతీయ రైల్వేలు పెద్ద రైలు నెట్‌వర్క్‌ను కలిగి ఉండటమే కాకుండా అనేక ఆశ్చర్యకరమైన అంశాలతో కూడి ఉంది. అందులో ఒకటి ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ రోజు మనం భారతీయ రైల్వే ప్రత్యేకమైన స్టేషన్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ప్లాట్‌ఫారమ్‌ల మధ్య దూరం కేవలం కొన్ని మీటర్లు కాదండోయ్.. ఏకండా రెండు కిలోమీటర్లు ఉంది. ఈ ప్రత్యేకమైన రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది, ప్లాట్‌ఫారమ్‌ల మధ్య అంత దూరం ఎందుకు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ స్పెషల్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది?

భారతీయ రైల్వేలోనే ఈ ప్రత్యేకమైన రైల్వే స్టేషన్, ప్లాట్‌ఫారమ్‌ల మధ్య 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది గంగా నది ఒడ్డున ఉన్న బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో ఉన్న బరౌని గ్రామం అనే పట్టణంలో నిర్మించారు. ప్రత్యేకమైన రైల్వే స్టేషన్‌తో పాటు, ఇది పారిశ్రామిక పట్టణంగా కూడా ముఖ్యమైనదిగా పేరుగాంచింది. ఈ పట్టణం ఆయిల్ రిఫైనరీ, థర్మల్ పవర్ ప్లాంట్‌కు ప్రసిద్ధి చెందింది.

బరౌని జంక్షన్ రైల్వే స్టేషన్..

ఈ ప్రత్యేకమైన రైల్వే స్టేషన్‌ను బరౌని జంక్షన్ అని పిలుస్తారు. దీనిని 1883లో బరౌని జంక్షన్‌గా నిర్మించారు. అప్పట్లో ఈ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారమ్‌ల సంఖ్య ఒకటి నుంచి మొదలయ్యేది. బరౌని జంక్షన్ నుంచి వివిధ డివిజన్లలో రైళ్లు నడిచేవి. అయితే ఒకటో నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై గూడ్స్ రైలు మాత్రమే నిలబడేది. కొన్నేళ్ల తర్వాత ఇక్కడి ప్రజలు ఫిర్యాదు చేస్తే.. ప్రజల ఫిర్యాదు మేరకు మరో బరౌని జంక్షన్‌ నిర్మించాలని నిర్ణయించారు.

రెండవ స్టేషన్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.

ప్రజల ఫిర్యాదుతో, బరౌని జంక్షన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో మరో బరౌని రైల్వే స్టేషన్ నిర్మించారు. రెండవ స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్‌ల సంఖ్యను అలాగే ఉంచారు. దీంతో ఒకే స్థలంలో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు స్టేషన్లు ఒకే పేరుతో ఉన్నాయి.

కొత్త బరౌని రైల్వే స్టేషన్ పూర్తయినప్పుడు, పాత బరౌనీ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ వన్ తొలగించారు. అప్పటి నుంచి పాత బరౌనీ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్‌ల సంఖ్య 2 నుంచి మొదలుపెట్టారు. దీంతో ఇది చాలా ప్రత్యేకమైన రైల్వే స్టేషన్. ఇక్కడ ఒకటో నంబర్ ప్లాట్‌ఫారమ్ నంబర్ లేదు.

ఎన్నో సమస్యలు..

రెండు రైల్వేస్టేషన్లు, అది కూడా చాలా దూరంలో ఉండడంతో చాలా మంది ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఎందుకంటే, ఒకటో నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై రైలు ఉన్న ప్రయాణికులు, వారు రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించి, రెండవ రైల్వే స్టేషన్‌కు సమయానికి చేరుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories