National Science Day 2021: జాతీయ సైన్స్ డే ఫిబ్రవరి 28 నే ఎందుకు?

National Science Day 2021 Theme History and Significance
x
సీవీ రామన్ (ది హన్స్ ఇండియా)
Highlights

National Science Day 2021: భౌతికశాస్త్రంలో రామన్ సేవలకు గుర్తుగా ఫిబ్రవరి 28 ని జాతీయ సైన్స్ డే గా ప్రభుత్వం ప్రకటించింది.

National Science Day 2021: సైన్స్ మన దైనందిన జీవితంలో ఒక భాగం. మన జీవితంలో సైన్స్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సైన్స్ లేని జీవితాన్ని మనం ఊహించలేము. సైన్స్ డే నిర్వహించుకోవడానికి గల కారణం ఏంటంటే.. ఇండియన్ సైంటిస్ట్ సీవీ రామన్‌ 1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్ట్‌ కనుగొనడంతో.. ఆ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహిస్తారు.

When is National Science Day Celebrated?

  • భౌతికశాస్త్రంలో రామన్ చేసిన అపారమైన సేవలకు గుర్తుగా ఫిబ్రవరి 28 ని జాతీయ సైన్స్ డే (February 28 National Science Day) గా ప్రభుత్వం ప్రకటించింది.

జాతీయ సైన్స్ డే 2021 ఉద్దేశ్యం...(National Science Day 2021 Theme)

  • జాతీయ విజ్ఞాన దినోత్సవం 2021 ఉద్దేశ్యం "Future of STI: విద్య, నైపుణ్యాలు మరియు పనిపై ప్రభావాలు".

ఎందుకు నిర్వహిస్తాం... (Why is National Science Day Celebrated?)

  • జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని నిర్వహించుకోవడం వెనుక ఉన్న ప్రాధమిక ఉద్దేశ్యం, రోజువారీ జీవితంలో సైన్స్ యొక్క ప్రాముఖ్యత.. దాని ఉపయోగాలను ప్రజలలో వ్యాప్తి చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అలాగే రామన్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ జాతీయ సైన్స్ డే ని ఘనంగా నిర్వహిస్తారు.

సీీవీ రామన్ జీవితం..

తమిళనాడు(Tamil Nadu)లోని తిరుచిరాపల్లిలో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతి అమ్మాళ్ దంపతులకు 1888 నవంబరు 7 న రామన్ జన్మించారు. విశాఖపట్నంలో ప్రాథమిక విద్యను పూర్తిచేసిన రామన్.. చిన్నప్పటి నుంచే విజ్ఞాన శాస్త్ర విషయాలపై ఆసక్తిని చూపే వారు. రామన్ తండ్రి కూడా భౌతికశాస్త్ర టీచర్ కావడంతో దానిపై మరింత కుతూహలం పెంచుకున్నారు. తెలివైన స్టూడెంట్ గా పేరు తెచ్చుకున్న రామన్ తన 12వ ఏట మెట్రిక్యులేషన్ పూర్తి చేసి ఫిజిక్స్(Physics)‌లో గోల్డ్‌మెడల్(Gold Medal) సాధించాడు. ఆ తర్వాత మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి.. ఆ సబ్జెక్టులో గోల్డ్ మెడల్ సాధించిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.

ఓ సారి ఓడలో ఇంగ్లాండు నుంచి ఇండియాకు తిరిగొస్తూ ఆకాశం, సముద్రపు నీరు రెండూ నీలిరంగులో ఉండటాన్ని ఆసక్తితో గమనించాడు. అప్పటిదాకా సముద్రపు నీలం రంగుకు కారణం ఆకాశపు నీలిరంగు ప్రతిబింబంగా ఏర్పడటం అనుకునేవారు. కానీ, అసలు కారణం సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమేనని ఊహించాడు.

కలకత్తా చేరుకోగానే తన ఊహలను నిజం చేసేందుకు ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘనపదార్థాల కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేశారు. ఆ ఆలోచనే రామన్ ఎఫెక్టుకు (Raman Effect) దారితీసింది. అధునాతనమైన పరికరాలు లేకపోయినా తన ఆలోచనకు ప్రయోగ రూపంలో జవాబు లభిస్తుందని నమ్మకంగా ఉన్న రామన్ అనుకున్నట్లుగానే 1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నాడు. పారదర్శకంగా ఉన్న ఘన, ద్రవ, వాయు పదార్థాల గుండా కాంతి ప్రసరించినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుందని రామన్ ఎఫెక్ట్ ద్వారా నిరూపించాడు. ఈ దృగ్విషయాన్ని 1928 మార్చి 16 న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞుల సదస్సులో వెళ్లడించాడు.

దీంతో బ్రిటీష్ ప్రభుత్వం 1929లో నైట్‌హుడ్ బిరుదుతో రామన్‌ను గౌరవించింది. రామన్ ఎఫెక్ట్ అసామాన్యమైందని కేవలం రూ.200 కూడా విలువలేని పరికరాలతో దృగ్విషయ నిరూపణ జరగడం అద్భుతమైందని ప్రపంచ శాస్త్రజ్ఞులందరూ రామన్ ను కొనియాడారు. ఈ పరిశోధనను గుర్తించిన రాయల్ స్వీడిష్ అకాడమీ భౌతికశాస్త్రానికి 1930లో నోబెల్ బహుమతి ప్రధానం చేసింది. సైన్స్‌కు చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆయనకు 1954లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించింది. చివరి వరకు భారతదేశంలో సైన్స్ అభివృద్దికై పాటుపడ్డ ఆయన 1970 నవంబర్ 21 కన్నుమాశారు.

1986 లో నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ (ఎన్‌సిఎస్‌టిసి) ప్రతి ఏటా ఫిబ్రవరి 28 న నేషనల్ సైన్స్ డేను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మొట్టమొదట జాతీయ విజ్ఞాన దినోత్సవం ఫిబ్రవరి 28, 1987 న నిర్వహించారు. గత 34 సంవత్సరాలుగా, రామన్ విజ్ఞాన శాస్ర్తానికి చేసిన కృషికి గుర్తుగా ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ డే నిర్వహించుకుంటాము.

Show Full Article
Print Article
Next Story
More Stories