Mother's day special: 'అమ్మ' పాటకి టాలీవుడ్‌ నీరాజనం

Mothers day special: అమ్మ పాటకి టాలీవుడ్‌ నీరాజనం
x
Highlights

అమ్మ... ఈ పిలుపులో ఎంతో మాధుర్యం.. ఎంతో మమకారం... ఎంతో తియ్యదనం...అందుకే భగవంతుడు సైతం అమ్మనే కావాలి అనుకున్నాడు. అందుకే అమ్మ అంటే అంత గొప్పది. అమ్మ...

అమ్మ... ఈ పిలుపులో ఎంతో మాధుర్యం.. ఎంతో మమకారం... ఎంతో తియ్యదనం...అందుకే భగవంతుడు సైతం అమ్మనే కావాలి అనుకున్నాడు. అందుకే అమ్మ అంటే అంత గొప్పది. అమ్మ గురించి ఎంతోమంది కవులు,ఎంతోమంది రచయితలు చాలా విధాలుగా వర్ణించారు. కానీ అమ్మ గురించి ఎంత చెప్పిన తక్కువే..!వందలో ఒక్కరు.. కోట్లలో ఒక్కరు. మనల్ని మనలా ప్రేమించేది కేవలం ఒక్క అమ్మ మాత్రమే. చివరికి ఈ లోకంలో నువ్వు ద్వేషించినా కూడా.. నిన్ను ప్రేమించే వాళ్లు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం అమ్మ మాత్రమే..

అలాంటి అమ్మ గురించి టాలీవుడ్ లో ఇప్పటివరకు చాలా సినిమాలు, పాటలు వచ్చాయి.. ఇప్పటికి, ఎప్పటికి ఎవర్ గ్రీన్ గా నిలిచాయి.. అలా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కొన్ని పాటలను ఇప్పుడు చూద్దాం.. !

దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన అమ్మ రాజీనామా సినిమాలోని "ఎవరు రాయగలరు అమ్మ అనే కమ్మని కావ్యం" ప్రతి ఒక్కరిని అక్కట్టుకుంది. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి లోని "నీవే నీవే నీవే నేనంటా", మహేష్ బాబు నాని సినిమాలోని "పెదవే పలికిన మాటల్లోని తియ్యని", అలీ హీరోగా నటించిన యమలీల చిత్రంలోని "సిరిలొలికించే చిన్ని నవ్వులే", సుమన్ హీరోగా నటించిన 20వ శతాబ్దంలో అమ్మని మించి దైవం ఉన్నదా అనే పాట.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పాట ఓ అమృతమే.. ఓ ఆణిముత్యమే..

నిజానికి ''అమ్మ లేకపోతే జననం లేదు. అమ్మ లేకపోతే గమనం లేదు. అమ్మ లేకపోతే సృష్టిలో జీవం లేదు. అమ్మే లేకపోతే అసలు సృష్టే లేదు''.. మనల్ని కంటిపాపలా కాపాడే అమ్మకి 'మదర్స్ డే' శుభాకాంక్షలు.. తెలుపుతుంది హెచ్ఎంటీవీ.!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories