మూడుసార్లకు మించి చలాన్ పడిందా.. లైసెన్స్‌తోపాటు రిజిస్ట్రేషన్ కూడా సస్పెండ్ చేయబడుతుంది

More Than Three Challans May Cause A Vehicle License Suspended Check New Challan Rules
x

మూడుసార్లకు మించి చలాన్ పడిందా.. లైసెన్స్‌తోపాటు రిజిస్ట్రేషన్ కూడా సస్పెండ్ చేయబడుతుంది

Highlights

Challan Rules: ట్రాఫిక్ రూల్స్ పాటించడం చాలా ముఖ్యం. ఈ విషయంలో ప్రభుత్వాలు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడు మూడు సార్లు కంటే ఎక్కువ చలాన్లు జారీ చేసిన డ్రైవర్ల లైసెన్స్‌లను సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధమైంది.

Challan Rules: ట్రాఫిక్ రూల్స్ పాటించడం చాలా ముఖ్యం. ఈ విషయంలో ప్రభుత్వాలు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడు మూడు సార్లు కంటే ఎక్కువ చలాన్లు జారీ చేసిన డ్రైవర్ల లైసెన్స్‌లను సస్పెండ్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. రోడ్డు భద్రతపై సుప్రీం కోర్టు కమిటీ ఇచ్చిన సూచనల మేరకు, ఉత్తరప్రదేశ్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వరుసగా మూడు కంటే ఎక్కువ చలాన్‌లు జారీ చేస్ లైసెన్స్ తే రద్దు చేసేలా చర్యలు తీసుకుంటామని నోయిడా పోలీస్‌ డిప్యూటీ కమిషనర్‌ ట్రాఫిక్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ప్రకటన చేశారు. ఇక్కడ పరిశీలించిన తర్వాత దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకంటున్నట్లు తెలుస్తోంది.

డ్రైవర్లు రెడ్‌లైట్‌ జంపింగ్‌, ఓవర్‌ స్పీడ్‌, ఓవర్‌లోడింగ్‌, గూడ్స్‌ వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించుకోవడం, డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు మొబైల్‌ ఫోన్‌ వాడడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి తప్పులు పునరావృతం చేస్తే వాహన రిజిస్ట్రేషన్‌ రద్దు చేయనున్నారు. మూడుసార్లు చలాన్‌ జారీ చేస్తే డ్రైవింగ్‌ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేస్తామని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుర్గాశంకర్‌ మిశ్రా ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఆ తర్వాత కూడా నిబంధనల ఉల్లంఘన ఆగకపోతే వాహనం రిజిస్ట్రేషన్‌ను కూడా రద్దు చేసుకోవచ్చు.

ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. వాస్తవానికి, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం వల్ల రహదారి భద్రత గాడి తప్పుతుంది. ఇది ప్రమాదాలను పెంచుతుంది. ఇటువంటి పరిస్థితిలో, ప్రజల జీవితాలు కూడా ప్రమాదంలో పడేవచ్చని తెలుస్తోంది. అందువల్ల ట్రాఫిక్ వ్యవస్థ సజావుగా సాగాలంటే ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories