గూగుల్ ప్లే స్టోర్ నుంచి 'మిత్రాన్' యాప్ తొలగించారు.. ఎందుకో తెలుసా?

గూగుల్ ప్లే స్టోర్ నుంచి మిత్రాన్ యాప్  తొలగించారు.. ఎందుకో తెలుసా?
x
Highlights

మిత్రాన్ యాప్ కు గూగుల్ ప్లే స్టోర్ షాకిచ్చింది. చైనా యాప్ టిక్ టాక్ ఇటీవల కాలంలో భారత దేశంలో ఇబ్బందులు ఎదుర్కుంటోంది. దేశీయంగా రూపొందిన మిత్రాన్ యాప్...

మిత్రాన్ యాప్ కు గూగుల్ ప్లే స్టోర్ షాకిచ్చింది. చైనా యాప్ టిక్ టాక్ ఇటీవల కాలంలో భారత దేశంలో ఇబ్బందులు ఎదుర్కుంటోంది. దేశీయంగా రూపొందిన మిత్రాన్ యాప్ టిక్ టాక్ కు గట్టిపోటీ ఇస్తోంది. పాకిస్తాన్ డెవలపర్ తయారు చేసిన ఈ యాప్ గూగుల్ స్పాం, ఫంక్షనాలిటీ నిబంధనలకు విరుద్ధంగా ఉందనే కారణంతో మిత్రన్ యాప్ ను గూగల్ ప్లే స్టోర్ నుంచి తొలగించినట్టు చెప్పింది. CNBC TV8 మిత్రాన్ యాప్ ను గూగుల్ నిలిపివేసిన విషయమై ప్రశ్నించగా ఈ జవాబిచ్చింది గూగుల్.

గూగుల్ పాలసీ పేజీలో ఏదైనా ఇతర యాప్ లను పోలి ఉండే విధంగా ఉండే యాప్ లను అంగీకరించబోమని ఉంటుంది. అదేవిధంగా ''ఇప్పటికే ఉన్న యాప్స్ అందిస్తున్న మాదిరిగా ఉండే సేవలను అందించే యప్ లను గూగుల్ అనుమతించదు. అంతేకాకుండా ప్రత్యేకమైన కంటెంట్ లేదా సేవలను సృష్టించడం ద్వారా యాప్ లు వినియోగదారులకు సేవలు అందిచాల్సి ఉంటుంది''

అయితే, ఈ విషయం పై Qboxus వ్యవస్థాపకుడు, CEO ఇర్ఫాన్ షేక్ చేసిన ప్రకటన ప్రకారం ఐఐటి విద్యార్థి టిక్ టాక్ యాప్ ను కొనుగోలు చేశారు. దానిలో ఎటువంటి మార్పులూ చేర్పులూ లేకుండా ఉన్నాయని షేక్ చెప్పారు. మిట్రాన్ పేరుతో ఉన్నయప్ గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్ళిందాని తెలిపారు.

కానీ, ఇక్కడ సమస్య ఎలా వచ్చిందంటే, డెవలపర్ చేసిన పని సరైనదే. దానితో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే, ఈ యాప్ భారత దేశంలో తయారైన యాప్ అంటూ ప్రచారంలోకి అక్కడి ప్రజలు తీసుకు వచ్చారు. అది నిజం కాదు. దీంతో ఇది సమస్యగా మారింది.అని ఇర్ఫాన్ షేక్ చెప్పారు.

ఇప్పటికీ ఈ యాప్ ఎవరిదనే విషయం లో స్పష్టత లేదు. ఈ మిత్రాన్ యాప్ మన దేశం యాప్ అని భారత ప్రజలు భావిస్తుండడం విచారకరం. మన దేశంలో సోషల్ మీడియా తో చెలరేగుతున్న అనేక ఇబ్బందుల్లో ప్రస్తుతం ఇదీ ఒకటిగా తయారైంది.

ఈ ఆర్టికల్ ను ఇంగ్లీష్ లో చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి


Show Full Article
Print Article
More On
Next Story
More Stories