కనిపించకుండా పోయి.. టిక్‌టాక్ లో ప్రత్యక్షమై..

కనిపించకుండా పోయి.. టిక్‌టాక్ లో ప్రత్యక్షమై..
x
Highlights

టిక్‌టాక్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఓ విప్లవంలా దూసుకు వచ్చిన యాప్. దీనితో అనర్థాలున్నాయని చాలా మంది గొడవ చేస్తున్నారు. చెన్నై లో అయితే, నిషేధానికి...

టిక్‌టాక్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఓ విప్లవంలా దూసుకు వచ్చిన యాప్. దీనితో అనర్థాలున్నాయని చాలా మంది గొడవ చేస్తున్నారు. చెన్నై లో అయితే, నిషేధానికి గురైంది కూడా. కానీ, మళ్లీ కోర్టు ఆ నిషేధాన్ని ఎత్తేసింది. అటువంటి టిక్‌టాక్ ఒక మహిళా జీవితాన్ని నిలబెట్టింది.

తమిళనాడులో జరిగిన ఈ సంఘటన ఇపుడు సంచలనంగా మారింది. కృష్ణగిరికి చెందిన సురేశ్, జయప్రదలకు ఇద్దరు పిల్లలు. మూడేళ్ల క్రితం 2016లో డ్యూటీకి అని చెప్పి బయటకు వెళ్లిన సురేశ్ మళ్లీ ఇంటికి రాలేదు. తెలిసిన వాళ్లందరిని అడిగిన ఆమెకు నిరాశే ఎదురైంది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.

కొన్ని రోజుల క్రితం జయప్రద బంధువులు ఒకరు టిక్ టాక్ చూస్తుండగా.. సురేశ్‌ను పోలిన వ్యక్తి కనపడ్డాడు. ఒక ట్రాన్స్ జెండర్‌తో పాటు ఉండటం గమనించిన ఆయన.. ఈ విషయం వెంటనే జయప్రదకు చెప్పాడు. వీడియోను జాగ్రత్తగా గమనించిన ఆమె.. అందులో ఉంది తన భర్తేనని రూఢీ చేసుకున్నాక.. విల్లుపురం పోలీసులకు వెళ్లి ఈ విషయం చెప్పింది. విచారణ ప్రారంభించిన పోలీసులు.. విల్లుపురం ట్రాన్స్‌జెండర్ అసోషియేషన్ సహకారంతో సురేశ్‌ను అతనితో పాటు ఉన్న ట్రాన్స్‌జెండర్ మహిళను హోసూరులో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను అసలు విషయం చెప్పాడు. కుటుంబంలో జరిగిన పరిణామాలు తనను బాధించాయని అందుకే ఇల్లు వదిలిపారిపోయానని తెలిపాడు. హోసూరు వెళ్లి ఓ ట్రాక్టర్ కంపెనీలో మెకానిక్‌గా జీవితం ప్రారంభించానన్నాడు. తనకున్న ట్రాన్స్‌జెండర్ మహిళతో ఉన్న సంబంధం గురించి కూడా చెప్పాడు. చివరికి సురేశ్, జయప్రద దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు పోలీసులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories