Devotional News: ఈ ఆలయాల్లోకి పురుషులకి ప్రవేశం లేదు.. వెళితే అంతే సంగతులు..!

Devotional News: ఈ ఆలయాల్లోకి పురుషులకి ప్రవేశం లేదు.. వెళితే అంతే సంగతులు..!
x

Devotional News: ఈ ఆలయాల్లోకి పురుషులకి ప్రవేశం లేదు.. వెళితే అంతే సంగతులు..!

Highlights

Devotional News: భారతదేశంలో సనాతన ధర్మం ప్రకారం ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు ఉన్నాయి.

Devotional News: భారతదేశంలో సనాతన ధర్మం ప్రకారం ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయం ఒక్కో ప్రత్యేకత, విశిష్టతను కలిగి ఉంటుంది. హిందూ సంప్రదాయం ప్రకారం అనుకోని పరిస్థితుల్లో తప్పా దాదాపు కుటుంబ సభ్యులందరూ కలిసి గుడికి వెళ్లే సంప్రదాయం ఉంది. కానీ దేశంలో పురుషులకు ప్రవేశం లేని కొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి. ఇందులోకి వెళ్లడానికి కేవలం మహిళలు మాత్రమే అర్హులు. అలాంటి ఆలయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.


కేరళలోని ఫేమస్ టెంపుల్‌లో భగవతి ఆలయం ఒకటి. ఇది అప్పుజకు ఆగ్నేయంగా 30 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం చాలా సుందరంగా ఉంటుంది. ఇక్కడ దుర్గాదేవి కొలువై ఉంటుంది. అమ్మవారిని మహిళలందరూ భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ప్రసిద్ధ నదులైన పంపా, మణిపాల ఆలయానికి ఇరువైపులా ప్రవహిస్తూ ఉండడంతో ఇక్కడి వాతావరణం పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది. కానీ ఈ ఆలయానికి కుటుంబ సమేతంగా వెల్లడం కుదరదు. ఎందుకంటే ఈ గుడిలోకి మహిళలకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. మహిళలు వారం రోజులు ఉపవాసం ఉండి ఈ అమ్మవారిని పూజించుకోవడం ఆనవాయితీ. పురుషులకు ఇందులోకి ఎంట్రీ ఉండదు.


అలాగే రాజస్థాన్లోని పుష్కర్లో బ్రహ్మ ఆలయం ఒకటి ఉంటుంది. ఈ ఆలయంలోకి కూడా మగవారికి ప్రవేశం నిషిద్ధం. ఇందుకు సంబంధించి ఓ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. దాని ప్రకారం.. ఒకరోజు సరస్వతీ దేవి లేని సమయంలో బ్రహ్మ యాగం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. దీంతో బ్రహ్మ గాయత్రి అనే అమ్మాయిని వివాహం చేసుకొని యాగాన్ని పూర్తి చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సరస్వతి కోపంతో ఆ ఆలయంలోకి మగవారికి ప్రవేశంలేదని శాపం విధించిందని చెబుతారు. ఒక వేళ పురుషులు లోపలికి వెళితే సంతాన సమస్యలు ఎదురవుతాయని చెబుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories