Suicides on Monday: సోమవారమే ఆత్మహత్యలు అధికం.. కారణం ఏంటో తెలుసా?

Suicides on Monday: సోమవారమే ఆత్మహత్యలు అధికం.. కారణం ఏంటో తెలుసా?
x
Highlights

Why people are mostly committing suicides on Monday: దేవుడు ఇచ్చిన అందమైన జీవితాన్ని కొందరు బలి చేసుకుంటారు. ఆత్మహత్య చట్టరీత్యా కూడా నేరమని...

Why people are mostly committing suicides on Monday: దేవుడు ఇచ్చిన అందమైన జీవితాన్ని కొందరు బలి చేసుకుంటారు. ఆత్మహత్య చట్టరీత్యా కూడా నేరమని తెలిసిందే. చిన్న చిన్న సమస్యలకే వందేళ్ల జీవితాన్ని బలి చేసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 70 లక్షల మందికి పైగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది.

డిప్రెషన్, ఆర్థిక ఒడిదొడుకులు ఆత్మహత్యలకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆత్మహత్యలకు సంబంధించి ఓ పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. టోక్యో యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ యూన్హీ కిమ్ నేతృత్వంలో ఈ పరిశోధన జరిగింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఆత్మహత్యల్లో 15-18 శాతం సోమవారం జరిగినవేనని ఈ పరిశోధనలో వెల్లడైంది. బీఎమ్‌జే అనే మెడికల్ జర్నల్‌లో ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను ప్రచురించారు. ఇంతకీ సోమవారం ఆత్మహత్యలు ఎందుకు ఎక్కువ జరుగుతాయి? దీని వెనకాల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ సర్వేలో భాగంగా 1971 నుంచి 2019 మధ్య 26 దేశాలలో 1.7 మిలియన్ల ఆత్మహత్యలపై లోతైన విశ్లేషణ జరిపారు. అమెరికా, ఆసియా, ఐరోపా దేశాలలో జరిగిన ఆత్మహత్యల డేటాను ఐరోపా దేశాలైన చెక్ రిపబ్లిక్, ఎస్టోనియా, ఫిన్‌లాండ్, జర్మనీ, ఇటలీ, రొమేనియా, స్పెయిన్, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్ దేశాల్లో జరిగిన ఆత్మహత్యలను అధ్యయనంలో చేర్చారు. ఈ దేశాల్లో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తులకు ఆ ఆలోచన సోమవారం నాడే అధికంగా ఉంటుందనే వాదన తెరపైకి వచ్చింది.

సోమవారం ఆత్మహత్యలు ఎక్కువగా జరగడానికి పని ఒత్తిడి కారణమని నిపుణులు చెబుతున్నారు. సోమవారం పని ఒత్తిడి, సెలవుల తర్వాత తిరిగి పని చేయడం వంటి కారణాలు కూడా ఆత్మహత్యకు దారి తీస్తున్నాయని అంటున్నారు. సోమవారం అనగానే పని ఒత్తిడి, భవిష్యత్తు గురించి తెలియని ఒక ఆందోళన వేధిస్తుందని ఈ కారణంగానే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే మానసిక అనారోగ్యంతో బాధపడేవారిలో కూడా సూసైడ్ టెండెన్సీ ఎక్కువగా ఉంటున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మలేరియా, హెచ్ఐవి/ఎయిడ్స్, రొమ్ము క్యాన్సర్ కంటే ఆత్మహత్యల వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా 15-29 సంవత్సరాల వయస్సు గల యువత ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటున్నారని పరిశోధనల్లో తేలింది. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో 95 శాతం మంది ఏదో ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నారని పరిశోధనల్లో వెల్లడైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories