భారత టేబుల్ టెన్నిస్ మహిళల విభాగంలో సరికొత్త చరిత్ర

భారత టేబుల్ టెన్నిస్ మహిళల విభాగంలో సరికొత్త చరిత్ర
x
Highlights

భారత మహిళా టేబుల్ టెన్నిస్ క్వీన్ మనీకా బాత్రా రికార్డుల మోత మోగించింది. ప్రపంచ మహిళా టీటీ మొదటి 50 మంది అత్యుత్తమ ప్లేయర్ల జాబితాలో చోటు...

భారత మహిళా టేబుల్ టెన్నిస్ క్వీన్ మనీకా బాత్రా రికార్డుల మోత మోగించింది. ప్రపంచ మహిళా టీటీ మొదటి 50 మంది అత్యుత్తమ ప్లేయర్ల జాబితాలో చోటు సంపాదించింది. ప్రపంచ టీటీ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్ ప్రకారం మనీకా బాత్రా 47వ స్థానంలో నిలిచింది. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా టీటీ ప్లేయర్ గా చరిత్ర సృష్టించింది. అంతేకాదు...గోల్డ్ కోస్ట్ వేదికగా గత ఏడాది ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ లో మనీకా బాత్రా ఏకంగా నాలుగు పతకాలు సాధించింది. ఇందులో మహిళల సింగిల్స్, టీమ్ విభాగాల బంగారు పతకాలు సైతం ఉన్నాయి. జకార్తా ఆసియా క్రీడల్లో సైతం మనీకా మిక్సిడ్ డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సంపాదించింది. తెలుగుతేజం ఆచంట శరత్ కమల్ తో కలసి జంటగా మిక్సిడ్ డబుల్స్ బరిలోకి దిగిన మనీకా బ్రాంజ్ మెడల్ అందుకొంది. కామన్వెల్త్ గేమ్స్, ఆసియాక్రీడల్లో పతకాలతో పాటు...ప్రపంచ ర్యాంకింగ్స్ 47వ ర్యాంక్ సాధించిన భారత తొలిమహిళగా మనీకా బాత్రా చరిత్ర సృష్టించింది. న్యూఢిల్లీ లోని హన్స్ రాజ్ మోడల్ స్కూల్ టేబుల్ టెన్నిస్ అకాడమీలో...సందీప్ గుప్తా శిక్షణలో రాటుదేలిన మనీకా...చైనా, జపాన్, కొరియా, హాంకాంగ్ , జర్మనీ, నైజీరియా దేశాల క్రీడాకారులకు గట్టి పోటీ ఇస్తూ... 47వ ర్యాంక్ లో నిలవడం ద్వారా...వారేవ్వా అనిపించుకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories