Viral Video: జైలు నుంచి విడుదలైన వ్యక్తి.. గేట్‌ బయట చేసిన పనికి అంతా షాక్‌

Viral Video: జైలు నుంచి విడుదలైన వ్యక్తి.. గేట్‌ బయట చేసిన పనికి అంతా షాక్‌
x
Highlights

Man dancing in front of jail after release: జైలు జీవితాన్ని ఎవరూ కావాలని కోరుకోరు. జైలు జీవితం నుంచి విముక్తి లభించిన రోజు ఎవరైనా సంతోషంగానే ఉంటారు. ఆ...

Man dancing in front of jail after release: జైలు జీవితాన్ని ఎవరూ కావాలని కోరుకోరు. జైలు జీవితం నుంచి విముక్తి లభించిన రోజు ఎవరైనా సంతోషంగానే ఉంటారు. ఆ క్షణాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఆ సెలబ్రేషన్స్‌ను కొంతమంది నాలుగు గోడలకే పరిమితం చేస్తే.. ఇంకొంతమంది తమ ఆనందాన్ని దాచుకోలేక అందరి ముందే వ్యక్తపరుస్తుంటారు.

జైలు నుంచి విడుదలైతే ఇంటికొచ్చాక కుటుంబ సభ్యులతో ఆ హ్యాపీ మూమెంట్‌ను సెలబ్రేట్ చేసుకునే వాళ్లు కొందరుంటే.. ఇంకొంతమంది జైలు గోడల బయటే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేస్తుంటారు. ఇప్పుడు మీరు చూడబోయే ఈ వ్యక్తి రెండో రకం. జైలు నుండి రిలీజ్ అవడంతోనే అక్కడే డ్యాన్స్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాడు. పోలీసులంతా పక్కనే ఉన్నా తన సంతోషాన్ని వెరైటీగా చాటుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేశాడంటే.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌కు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు ఇటీవల ఓ కేసులో అరెస్ట్‌ చేశారు. అయితే పేదవాడు కావడం, ఎవరూ పరిచయాలు లేకపోవడంతో అతడి తరుఫున వాదించేందుకు న్యాయవాది లేరు. అలాగే బెయిల్‌ ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. జరిమానా చెల్లించకపోవడంతో మరికొంత కాలం అదనంగా జైలులో ఉన్నాడు.

ఆ వ్యక్తి కొన్ని నెలలపాటు జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం లీగల్ సర్వీసెస్ అథారిటీకి తెలిసింది. ఆ వ్యక్తికి బెయిల్‌ ఇప్పించేందుకు సహకరించింది. దీంతో ఆ వ్యక్తి జరిమానా చెల్లించకపోయినప్పటికీ బెయిల్‌పై బుధవారం విడుదలయ్యారు.

జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే అతను తన సంతోషాన్ని డ్యాన్స్‌ రూపంలో వ్యక్తపరిచాడు. మైకేల్‌ జాక్సన్‌ తరహా స్టెప్పులేస్తూ పండగ చేసుకున్నారు. దీనంతటినీ అక్కడే ఉన్న వారు ఫోన్‌లో రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories