Viral Video: రెండు బస్సుల మధ్య ఇరుక్కుని వ్యక్తి.. ఇంతకీ బ్రతికి బయటపడ్డాడా..? మీరే చూడండి..!

Man Narrowly Escaped Death in Thanjavur Tamil Nadu
x

Viral Video: రెండు బస్సుల మధ్య ఇరుక్కుని వ్యక్తి.. ఇంతకీ బ్రతికి బయటపడ్డాడా..? మీరే చూడండి..!

Highlights

Viral Video: సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎక్కడ లేని వింతలు, విచిత్రాలు కళ్లముందే కనిపిస్తున్నాయి.

Viral Video: సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎక్కడ లేని వింతలు, విచిత్రాలు కళ్లముందే కనిపిస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఇట్టే వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని వింతలు, కళ్లు చెదిరేవి, భయాందోళన కలిగించే సంఘటనలు చూస్తూ ఉంటాము. తాజా ఓ ఘటన అందర్ని ఖంగుతినేలా చేసింది. ఓ వ్యక్తి రెండు బస్సుల మధ్యలో ఇరుక్కుని బ్రతికి బయటపడ్డాడు. కానీ ఆ ఘటన మాత్రం అందర్నీ భయాందోళనకు గురిచేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

అసలేం జరిగిందంటే.. తమిళనాడు రాష్ట్రం పట్టుకొట్టాయ్స్‌లో ఓ వ్యక్తి రోడ్డు దాటే క్రమంలో ఓ బస్సు స్పీడ్‌గా వచ్చింది. దీంతో అతను కాస్త స్లో అయ్యాడు. రెప్పపాటు కాలంలో ఆ బస్సును మరో బస్సు ఓవర్ టేక్ చేయబోయింది. ఇంకేముంది ఆ వ్యక్తి రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయారు. ఈ ఘటన చూసిన వారంతా ఇక అతని పని అయిపోయిందనుకున్నారు. కానీ రెండు బస్సులు కాస్త దూరం జరగడంతో అతను కిందపడిపోయారు. ఆ తర్వాత అతను లేచి వెళ్లిపోయాడు.

ఈ వీడియో చూసిన కొందరు మొదట అయ్యో అయ్యో అనుకున్నారు. మరికొందరైతే ఖంగుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి చిన్న చిన్న గాయాలు కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అతనికి భూమి మీద ఇంకా నూకలున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories