Viral Video: దిమాక్‌ ఉన్నొడు దునియా మొత్తం చూస్తాడు.. ఈ వీడియో చూస్తే ఒప్పుకోవాల్సిందే

Viral Video: దిమాక్‌ ఉన్నొడు దునియా మొత్తం చూస్తాడు.. ఈ వీడియో చూస్తే ఒప్పుకోవాల్సిందే
x
Highlights

Viral Video of desi jugaad for washroom door: 'కళ్లు ఉన్న వాడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాక్‌ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు'. ఇదొక సినిమా డైలాగ్‌....

Viral Video of desi jugaad for washroom door: 'కళ్లు ఉన్న వాడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాక్‌ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు'. ఇదొక సినిమా డైలాగ్‌. నిజానికి కష్టపడి చేసే పని కంటే స్మార్ట్‌ వర్క్‌ ఎంతో మెరుగైనా ఫలితాలను ఇస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే చాలా మంది హార్డ్‌ వర్క్‌ కాదు, స్మార్ట్‌ వర్క్‌ చేయండని సూచిస్తుంటారు. ఆలోచనతో చేసే పనులు శారీరక శ్రమను తగ్గించడమే కాకుండా మంచి ఫలితాలను ఇస్తాయి.

తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో చూస్తే ఈ మాట నిజమే అనిపించకమానదు. ఓ వ్యక్తి వెరైటీగా ఆలోచించిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేశాడో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. సాధారణంగా బాత్‌రూమ్‌ను ఉపయోగించుకునే సమయంలో వేరే వాళ్లకు తెలిసేలా హోటల్స్‌, థియేటర్లలో పలు రకాల ఏర్పాట్లు ఉంటాయి. బాత్‌ రూమ్‌ గడియ పెట్టగానే లోపల వ్యక్తులు ఉన్నట్లు చూపించే ఇండికేషన్‌ ఉంటుంది.

మరి ఇళ్లలో మనం ఉపయోగించే సాధారణ బాత్‌రూమ్‌లలో ఇలాంటి సదుపాయం ఉండదు కదా! అందుకే ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. బాత్‌రూమ్‌ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు ఓ బోర్డును పెట్టేశాడు. అది కూడా ఒక కర్రను ఉపయోగించి ఎలాంటి ఖర్చు లేకుండా వినూత్నంగా. వ్యక్తి లోపలికి వెళ్లే ముందు గేట్‌ లాంటి కర్రను ఓపెన్‌ చేయగానే లోపల వ్యక్తి ఉన్నాడు అని తెలిపే సైన్‌ బోర్డ్‌ కనిపిస్తుంది.

అలాగే బయటకు రాగానే లోపల ఎవరూ లేరు అనే బోర్డు కనిపించేలా సెట్ చేశాడు. దీనిని వీడియోగా తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది ఈ వీడియో కాస్త క్షణాల్లో వైరల్‌ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజంగా ఐడియా భలే ఉంది గురూ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తం మీద ఈ వీడియో నెటిజన్లను మాత్రం తెగ ఆకట్టుకుంటోంది. మరి ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories