Kite Flying: సంక్రాంతికి, గాలిపటానికి సంబంధం ఏంటీ? అసలెందుకు ఆరోజు పతంగులను ఎగరవేస్తారు?

Kite Flying: సంక్రాంతికి, గాలిపటానికి సంబంధం ఏంటీ? అసలెందుకు ఆరోజు పతంగులను ఎగరవేస్తారు?
x
Highlights

Kite Flying: సంక్రాంతి పండగు వచ్చిందంటే చాలు సంబరాలు అంబరాన్నంటుతాయి.

Kite Flying: సంక్రాంతి పండగు వచ్చిందంటే చాలు సంబరాలు అంబరాన్నంటుతాయి. డూడూ బసవన్నల హడావిడి...హరిదాసు గానాలు బంధుమిత్రుల సందడితో ఇల్లంతా సందడిసంతరించుకుంటుంది. ఇదంతా ఒక ఎత్తైతే పిల్లల హడావిడి మరోఎత్తు. ఎక్కడ చూసినా ఎటు చూసినా పిల్లలు పతంగులతో దర్శనమిస్తుంటారు. అవి గాలిలో పైపైకి పోతుంటే వారి మొహాలు సంతోషంతో వెలిగిపోతుంటాయి.

సంక్రాంతి పండగంటే గుర్తుకొచ్చే మరో వేడుక పతంగులు...నీలాల నింగిలో... హరివిల్లుల్లోని ఏడురంగులతో అందంగా... చూడముచ్చటగా... కనువిందు చేస్తుంటాయి గాలిపటాలు. పండుగ రాగానే విశాలమైన ప్రదేశాల్లోనూ ఎత్తైన మేడలలోనూ ఈ గాలిపటాలను ఎగురేసేందుకు చిన్నపిల్లలు పోటీపడుతూ ఉంటారు.

సంక్రాంతి పండక్కి ఈ గాలిపటాలను ఎందుకు ఎగరవేస్తుంటారు. మకర సంక్రాంతి పండుగ చలికాలంలో వస్తుంది. సంక్రాంతి రోజు సూర్య భగవానుడు దక్షిణాయన కాలం నుంచి ఉత్తరాయణ కాలంలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఈ పండుగను సూర్యభగవానుడికి అంకితం చేస్తారు. ఈ పండుగతో చలికాలం పూర్తై వసంత కాలంలోకి ఆహ్వానం పలకడం కోసం అనాదిగా ఆకాశంలో గాలిపటాలను ఎగురవేస్తున్నారు. గాలిపటాలు ఎగరవేయడం వెనుక ఆధ్యాత్మికంగా మరో కారణంగా కూడా ఉందని నమ్ముతారు. 6 నెలల తర్వాత సకల దేవతలు నిద్ర నుంచి మేల్కొంటారని వారికి ఆహ్వానం పలికేందుకు పతంగులు ఎగరవేస్తారని విశ్వసిస్తుంటారు.

ఈ గాలి పటాలకు పెద్ద చరిత్రే ఉంది. 2,800 సంవత్సరాల క్రితం చైనాలో మొదటిసారి ఈ గాలిపటాలను తయారు చేశారు...మానవుడు పైకి ఎగరాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఈ పతంగిని రూపొందించారట. ఆ తర్వాత ఎవరైనా ప్రమాదంలో ఉంటే సమాచారాన్ని పంపడానికి తొలిసారిగా ఈ పతంగులను ఉపయోపగించారు. మొదట్లో చెక్కలతో దీర్ఘచతురస్రాకారంలో చేశారు. అనంతరం వీటిని ఫైబర్‌ గ్లాస్‌, నైలాన్‌తో తయారుచేస్తున్నారు.

భారత్‌లోని హర్యానాలో ఎక్కువగా ఈ గాలిపటాలను ఎగరవేస్తారు. బసంత్‌పంచమీ, రాఖీ, మకరసంక్రాంతి రోజున ఈ పతంగులు దర్శనమిస్తాయి. పంజాబ్‌లో మాత్రం ప్రేమకు చిహ్నంగాఎగురవేస్తారు. ఇక ఢిల్లీలో మాత్రం ఈ పతంగులను స్వాతంత్ర్యదినోత్సవం రోజున ఎగురవేస్తారు.

పతంగుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది గుజరాత్. జనవరి 14 ప్రతీ ఏటా మకర సంక్రాంతి రోజున అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ కైట్‌ ఫెస్టివల్‌ జరుగుతుంది. ఈ ఫెస్టివల్‌ చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. వివిధ ఆకృతుల్లో ఆకారాల్లో ఆకట్టుకునే గాలిపటాలు అలా అలా వయ్యారంగా ఆకాశంలో ఎగురుతోంటే...సమయమే తెలీదు. అక్కడ చేపలు, దేవతలు, దెయ్యాలు, భయంకరమైన జంతువులు, పక్షులు, సూపర్‌మ్యాన్‌ వంటి మనుషులు అంతా గాలిపటాల రూపంలో ఆకాశంలో విహరిస్తారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో పతంగులకు పుట్టినిల్లు హైదరాబాద్. నిజాం హయాం నుంచి పతంగులకు ఇక్కడ విశేష ఆదరణ ఉంది. సంక్రాంతి పండుగ వస్తుదంటే చాలు పతంగుల తోరణాలతో పాతబస్తీ మెరిసిపోతుంది. ఆకాశంలో ఏ దిక్కున చూసినా పతంగులు ప్రత్యక్షమవుతుంటాయి.

చిన్నాపెద్దా ఆడ మగా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ పతంగులు ఎగువేసేందుకు పోటీపడుతుంటారు. వివిధ డిజైన్లతో హీరోల ఫోటోలతో డిజైన్లతో పతంగులు మార్కెట్లో ప్రత్యక్షమవుతుంటాయి. ఏదేమైనా ఈ పతంగుల పండగ సంక్రాంతికే పెద్ద హైలైట్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories