Indian Railway: TTE, TC ఉద్యోగాల మధ్య తేడా ఏంటి.. డ్యూటీస్‌ ఏ విధంగా ఉంటాయి..!

Know The Difference Between Railway TTE And TC Jobs What Are The Duties
x

Indian Railway: TTE, TC ఉద్యోగాల మధ్య తేడా ఏంటి.. డ్యూటీస్‌ ఏ విధంగా ఉంటాయి..!

Highlights

Indian Railway: భారతీయ రైల్వేలో ప్రయాణం చౌకగా ఉంటుంది. తక్కువ ధరలో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు.

Indian Railway: భారతీయ రైల్వేలో ప్రయాణం చౌకగా ఉంటుంది. తక్కువ ధరలో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. అయితే చాలామంది ప్రయాణికులు రైల్వేస్టేషన్‌ వెళ్లినప్పుడు అక్కడ నల్లకోటు ధరించిన టీటీఈ, టీసీలను చూస్తారు. కానీ ఆ ఇద్దరు వేర్వేరు డ్యూటీలు చేస్తారని చాలా మందికి తెలియదు. ఈ రోజు TTE (ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్), TC (టికెట్ కలెక్టర్) గురించి వివరంగా తెలుసుకుందాం.

TTE (ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్)

TTE అంటే ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్ అని అర్థం. ఈ ఉద్యోగి ప్రీమియం రైళ్లలో ప్రయాణించే వ్యక్తుల టిక్కెట్లను చెక్‌ చేస్తాడు. TTE బేసిక్‌ వర్క్‌ రైళ్లో ప్రయాణీకులను గుర్తించడం, ఐడీ, సీటు సంబంధిత సమాచారాన్ని చెక్‌ చేయడం. అతను ఎప్పుడూ నల్లకోటు ధరించి కనిపిస్తాడు. అతని కోర్టు బ్యాడ్జ్‌పై TTE అని స్పష్టంగా రాసి ఉంటుంది. ఇతడికి సంబంధించిన అన్ని పనులు రైలు లోపలే ఉంటాయి.

TC (టికెట్ కలెక్టర్)

TTE లాగా TC పని కూడా టిక్కెట్లను తనిఖీ చేయడమే కానీ ఇద్దరి హక్కులలో తేడా ఉంటుంది. TTE రైలు లోపల మాత్రమే టిక్కెట్లను తనిఖీ చేస్తాడు. కానీ TC ప్లాట్‌ఫారమ్‌పై టికెట్లను చెక్‌ చేస్తాడు. TCలు ఎక్కువగా ప్లాట్‌ఫాంలపై కనిపిస్తారు. కొన్నిసార్లు స్టేషన్ గేటు వద్ద నిలబడి టికెట్లను చెక్‌చేస్తూ ఉంటారు.

టీటీఈ ఎలా అవ్వాలి

టీటీఈ కావాలంటే 50 శాతం మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. టీటీఈ కావాలంటే టీసీ పోస్టు ద్వారా వెళ్లాలి. ఐదు నుంచి పది సంవత్సరాల అనుభవం తర్వాత TC రైల్వేలో TTEగా మారుతాడు.

TC అర్హత

TC కావడానికి ఒక అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుంచి 50 శాతం మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు ఉండాలి. అలాగే రిజర్వ్‌డ్‌ అభ్యర్థులకు వయో సడలింపు ఇస్తారు.

TC ఎంపిక ప్రక్రియ

TC కావడానికి అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. తర్వాత రాత పరీక్ష ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇందులో అర్హత సాధించిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. తర్వాత తుది మెరిట్ జాబితాను సిద్ధం చేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories