Viral Video: ఒళ్లు జలదరించే వీడియో.. మూడు పాములను మింగేసిన కింగ్‌కోబ్రా

King cobra swallow 3 snakes video goes viral in social media
x

Viral Video: ఒళ్లు జలదరించే వీడియో.. మూడు పాములను మింగేసిన కింగ్‌కోబ్రా

Highlights

ఓ కింగ్‌ కోబ్రా ఏకంగా మూడు పెద్ద పాములను మింగేసింది.

సృష్టిలో ఒక జంతువు మరో జంతువుపై దాడి చేయడం సర్వసాధారణమైన విషయం. అయితే ఆధిపత్య పోరులో భాగంగా జీవులు ఒకవాటిపై మరొకటి దాడి చేసుకుంటాయి. ఈ క్రమంలో ఒకటిని మరొకటి అంతమొందిస్తుంటాయి కూడా. అయితే ఒకే జాతికి చెందిన రెండు జీవులు ఒకదాన్ని మరొకటి తినడం మాత్రం చాలా అరుదని చెప్పాలి. మరీ ముఖ్యంగా పాములైతే అస్సలు ఇలాంటి పనులు చేయవు.

కానీ తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో మాత్రం ఒళ్లు గగుర్లుపొడిచేలా ఉంది. ఓ కింగ్‌ కోబ్రా ఏకంగా మూడు పెద్ద పాములను మింగేసింది. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఓ పొడవాటి కింగ్ కోబ్రా రోడ్డు పక్కన కదలకుండా అక్కడే పడుకొని ఉంది. దీంతో దానిని చూసిన వారంతా భయంతో చూస్తూ ఉండి పోయారు. ఈ క్రమంలోనే పామును పట్టుకోవడానికి స్నేక్‌ క్యాచర్‌ను పిలిపించారు.

దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న స్నేక్‌ క్యాచర్‌ వచ్చి పామును జాగ్రత్తగా గమనించాడు. దీంతో పాము నోట్లో నుంచి ఒక్కొక్కటిగా మొత్తం మూడు పాములు బయటకు వచ్చాయి. దీనంతటినీ అక్కడే ఉన్న వారు ఫోన్‌లో బంధించారు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్‌కి గురవుతున్నారు. ఒక్కోపాము అలా వస్తుండడం చూసి గుండె జారినంత పని అయ్యిందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్‌ వస్తున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories