Indian Railways: భారతీయ రైల్వేలో విచిత్రమైన స్టేషన్.. ఇక్కడ ట్రైన్ ఆగితే సెల్ఫీ దిగాల్సిందే.. అంత స్పెషాలిటీ ఎందుకో తెలుసా?

Kanchausi Railway Station and Platforms between Kanpur Dehat and Oraiya Districts check Indian Railways Interesting facts
x

Indian Railways: భారతీయ రైల్వేలో విచిత్రమైన స్టేషన్.. ఇక్కడ ట్రైన్ ఆగితే సెల్ఫీ దిగాల్సిందే.. అంత స్పెషాలిటీ ఎందుకో తెలుసా?

Highlights

Indian Railways Interesting Facts: భారతీయ రైల్వేలు అనేక రకాలైన రైళ్లు, రైల్వే స్టేషన్‌లను కలిగి ఉంటాయి. వాటిలో అనేక ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. అందులో ఒక రైల్వే స్టేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఇక్కడ ట్రైన్ ఆగితే, రెండు వేర్వేరు జిల్లాల్లో ఆగినట్లున్నమాట.

Kanchausi Railway Station: భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌గా పేరుగాంచాయి. ఇందులో రోజుకు 4 కోట్ల మంది ప్రజలు ప్రయాణిస్తున్నారు. భారతీయ రైల్వేల నెట్‌వర్క్ చాలా విస్తృతమైనది. ఇది ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణించడానికి 3 రోజుల వరకు పడుతుంది. భారతీయ రైల్వేలు అనేక రకాలైన రైళ్లు, రైల్వే స్టేషన్‌లను కలిగి ఉంటాయి. వాటిలో అనేక ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. అందులో ఒక రైల్వే స్టేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఇక్కడ ట్రైన్ ఆగితే, రెండు వేర్వేరు జిల్లాల్లో ఆగినట్లున్నమాట.

ఈ ఆసక్తికరమైన స్టేషన్ ఎక్కడ ఉందంటే?

భారతీయ రైల్వేలకు చెందిన ఈ ఆసక్తికరమైన రైల్వే స్టేషన్ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ గ్రామంలో ఉంది. ఈ స్టేషన్ పేరు కంచౌసి రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో సగం కాన్పూర్ దేహత్‌లో, సగం ఔరయా జిల్లాలో ఉంటుంది. ఇది మాత్రమే కాదు ఈ స్టేషన్ ప్లాట్‌ఫారమ్ ఔరయా జిల్లా పరిధిలోకి వస్తుంది. అంటే ఈ స్టేషన్‌లో రైలు ఆగినప్పుడు అది ఒకేసారి రెండు జిల్లాల్లో నిలుస్తుందన్నమాట.

కాన్పూర్-దేహత్‌లోని స్టేషన్..

కంచౌసి రైల్వే స్టేషన్ కార్యాలయం గురించి మాట్లాడితే, అది కాన్పూర్ దేహత్ ప్రాంతంలో వస్తుంది. అంటే ఎక్కడికైనా వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకోవాలంటే కాన్పూర్ దేహత్ ప్రాంతంలోని ఆఫీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత రైలు పట్టుకోవడానికి ఔరయా జిల్లా పరిధిలోని రైల్వే ప్లాట్‌ఫారమ్‌కు చేరుకోవాలి. ఆ తర్వాత ఏ రైలు వచ్చినా రెండు జిల్లాల్లో సగానికి విభజించారు. మీ సీటు ప్రకారం కంపార్ట్‌మెంట్‌లో వెళ్లి కూర్చోవాలి.

ప్రారంభంలో ఎక్స్‌ప్రెస్ రైలు నడవలే..

రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఇంతకుముందు కంచౌసి రైల్వే స్టేషన్ నుంచి ఎక్స్‌ప్రెస్ రైలు నడిచేది. అక్కడ కొన్ని ప్యాసింజర్ రైళ్లు మాత్రమే నిలిచి ఉండేవి. అనంతరం ఫరక్కా ఎక్స్‌ప్రెస్‌ను కూడా నిలుపుతున్నారు. ఈ స్టాపేజ్ నిర్మాణం వల్ల సమీపంలోని ప్రజలకు చాలా సౌలభ్యం ఏర్పడింది. ఇప్పుడు వారు అక్కడి నుంచి పెద్ద నగరాలకు కూడా రైళ్లు పట్టుకోవచ్చు. ఈ ఆసక్తికరమైన రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ప్రజలు సెల్ఫీలతో సందడి చేస్తుంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories