Jilebi: జిలేబి ఇండియన్‌ స్వీట్‌ కాదు.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా..?

Jilebi is not Indian Sweet Do You Know its History | Indian Sweets
x

Jilebi: జిలేబి ఇండియన్‌ స్వీట్‌ కాదు.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా..?

Highlights

Jilebi: స్బీట్స్‌ అంటే అందరికి ఇష్టమే. ఎంతో ఇష్టంగా తింటారు. ఇందులో ఇండియన్స్‌ స్వీట్స్‌ ప్రపంచ దేశాలలో చాలా ఫేమస్...

Jilebi: స్బీట్స్‌ అంటే అందరికి ఇష్టమే. ఎంతో ఇష్టంగా తింటారు. ఇందులో ఇండియన్స్‌ స్వీట్స్‌ ప్రపంచ దేశాలలో చాలా ఫేమస్. అయితే అందులో కొన్ని స్వీట్లు భారతదేశానికి సంబంధించినవి కావు. ఇవి ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఫేమస్‌గా మారాయి. అలాంటి కోవలోనికే చెందుతుంది జిలేబి. ఇది ఇండియన్‌ స్వీట్‌ కాదు.

కాని దీని పేరు వింటేనే అందరికి నోట్లో నీళ్లు వస్తాయి. చలికాలంలో వేడి వేడిగా తినడానికి చాలామంది ఆసక్తి కనబరుస్తారు. అయితే జిలేబి ఎక్కడి నుంచి వచ్చిందో దాని చరిత్ర ఏంటో తెలుసుకుందాం.

జిలేబి అనేది ఒక అరబిక్ పదం. దీని అసలు పేరు జలబియా. కానీ భారతదేశంలో దీనిని జిలేబి అని పిలుస్తారు. నిమ్మ రసం, పానకంలో తడిసినందున దీనికి ఈ పేరు వచ్చింది. అంతేకాదు దీని రూపం వల్ల కూడా ఇది జిలేబిగా మారింది. పాకిస్తాన్‌లో దీనిని జలేబి అంటారు. మహారాష్ట్రలో దీనిని జిల్బీ అని, బెంగాల్‌లో జిల్పి అని పిలుస్తారు. జలేబీ అనేది చాలా పూర్వకాలంనాటిది. 13 వ శతాబ్దంలో ముహమ్మద్ బిన్ హసన్ అల్-బాగ్దాదీ ఈ అద్భుతమైన వంటకంపై పుస్తకాన్ని రాశాడు.

ఆ పుస్తకం పేరు అల్-తాబిఖ్ అని చెప్పారు. ఇందులో జౌల్బియా అంటే జలేబీ గురించి ప్రస్తావించారు. ఇదొక్కటే కాదు పర్షియన్, టర్కిష్ వ్యాపారులు భారతదేశానికి వచ్చినప్పుడు మన దేశంలో దీనిని తయారు చేయడం ప్రారంభించినట్లు చెబుతారు. జిలేబి జ్యూసీ టేస్ట్ వల్ల అందరికీ నచ్చుతుంది. దీనిని ఇంట్లో కూడా సులువుగా చేసుకోవచ్చు.

జిలేబీని వివిధ ప్రాంతాలలో రకరకాల పేర్లతో పిలుస్తారు. ముఖ్యంగా చలికాలంలో జిలేబీని బాగా ఇష్టపడతారు. చల్లని జిలేబీ అంతగా రుచించదు. జిలేబీ తయారీకి కావలసిన పదార్థాలు మైదా, నెయ్యి, పంచదార. మీరు దీన్ని ఇంట్లో అరగంటలో సులభంగా తయారుచేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories