మహిళా దినోత్సవం: ఉద్యోగం చేసే మహిళలకు మన దేశంలో అమలులో ఉన్నసౌలభ్యాలు ఇవే!
మహిళ.. తలుపు చాటున నిలబడి అతిథులతో మాట్లాడే బేల కాదు ఈరోజు. మహిళ..కష్టం వస్తే పుట్టింటికి పరుగుతీసి భోరున ఏడ్చే అబల కాదు ఇప్పుడు.. మహిళ..పురుషుడి...
మహిళ.. తలుపు చాటున నిలబడి అతిథులతో మాట్లాడే బేల కాదు ఈరోజు. మహిళ..కష్టం వస్తే పుట్టింటికి పరుగుతీసి భోరున ఏడ్చే అబల కాదు ఇప్పుడు.. మహిళ..పురుషుడి ఆర్థిక మూలాలపై జీవనం సాగించే ముదిత కాదు ప్రస్తుతం.. మహిళ.. నాలుగు గోడల మధ్య నలిగిపోయే నరయంత్రం కాదు నవ యుగంలో..
మహిళ..ఈరోజు స్వయంచలిత. మూడత్వపు ఇనుప సంకెళ్ళను తెంచుకుంటూ.. వంటింటి నుంచి అంతరిక్షపు అంచుల దాకా పురుషుల తో సమానంగా ఒక్కో చోట అంతకంటే ఎక్కువగా ముందుకురుకుతున్న చైతన్య జలపాతం. సృష్టి పరంగా సంక్రమించిన శారీరక బలహీనతను తన మేధస్సుతో బలవంతమైన ఆయుధంగా మార్చుకుని ప్రపంచ ప్రగతిలో తన ఆధిపత్యం కోసం వడివడిగా అడుగులు వేస్తోంది. తలుపు చాటునుంచి బయటకు వచ్చి సువిశాల ప్రపంచ వేదికపై తన వాణిని బలంగా వినిపిస్తూ అన్ని రంగాలలోనూ తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతోంది ఆధునిక మహిళ.
ఆధునికత సంతరించుకున్నా.. వంటింటి గోడల్ని దాటి రంగుల ప్రపంచంలో ఇంద్రధనస్సులా మెరిసిపోతున్నా మహిళ తన ప్రేమైక జీవన మృదుత్వాన్ని వదిలిపెట్టలేదు. అమ్మగా..చెల్లిగా.. భార్యగా తన సృష్టి ధ్రమాన్ని విడిచిపెట్టలేదు. పురుశాదిక్యానికి సవాలు విసురుతూనే.. తనకున్న బాధ్యతల బరువునూ ఓరిమితో మోస్తూ వస్తోంది. ఎందరో మహిళా మణులు తమ చైతన్య స్ఫూర్తితో ప్రేమైక దీప్తితో ప్రపంచ మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ జేజేలు చెబుతోంది హెచ్ ఎం టీవీ.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉద్యోగం చేస్తున్న మహిళల కోసం మన దేశంలో..రాష్ట్రాల్లో అమలులో ఉన్న సెలవులకు సంబంధించిన వివరాలు అందిస్తున్నాం.
-----------------------
మహిళలు ప్రత్యేక సౌలభ్యాలు- సెలవులు
(ఇన్ పుట్స్..ఎస్.సూర్య రెడ్డి, విజయవాడ చేసిన వాట్సప్ మెసేజి నుంచి తీసుకోవడం జరిగింది)
- ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ సబార్డినేట్ సర్వీసు రూల్సు లోని నిబంధన 22 ద్వారా వెసులుబాటు కల్పించినది.
(G.O.Ms.No.237,GAD తేది:28-05-1996) (ఇది మహిళా ఉద్యోగులకు చరిత్రలో నిలిచిపోయే G.O.
- ఉద్యోగ కల్పనకు సంబంధించి మహిళల పట్ల అమలౌతున్న వివక్షను నిర్మూలించడానికి, ఉద్యోగ కల్పనలో సమానత్వం సాధించడానికి ఉద్దేశించిన మార్గదర్శకాలు.
(G.O.Ms.No.27 తేది:09-01-2004)
- మరణించిన ప్రభుత్వ ఉద్యోగి వివాహిత కుమార్తేకు కారుణ్య నియామక పథకం ద్వారా ఉద్యోగం కల్పిస్తారు.
(G.O.Ms.No.350 తేది:30-07-1999)
- అవివాహిత ప్రభుత్వ ఉద్యోగి మరణించిన సందర్భంలో ఆ ఉద్యోగి మీద ఆధారపడిన చెల్లెలుకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగ అవకాశం.
(Memo.No.17897 తేది:20-04-2000)
- పనిస్థలాల్లో మహిళా ఉద్యోగుల పట్ల లైంగిక వేధింపులను నిషేధిస్తూ ఉత్తర్వులు.
(G.O.Ms.No.322 GAD తేది:19-07-1995)
- ఎస్.ఎస్.సి సర్టిఫికేట్ లో తండ్రి పేరుతో పాటు తల్లిపేరు చేర్చు ఉత్తర్వులు.
(మెమో.నం.7679 తేది:14-09-2010)
- మార్చి 8న మహిళా దినోత్సవం రోజున మహిళా ఉద్యోగులకు స్పెషల్ సి.ఎల్ మంజూరు.
(G.O.Ms.No.433 GAD తేది:4-8-2010)
- మహిళా ఉపాధ్యాయులకు 5 రోజుల అదనపు సెలవు మంజూరు.
(G.O.Ms.No.374 తేది:16-03-1996)
- జూనియర్ లెక్చరర్లకు 5 రోజుల అదనపు సెలవుల మంజూరు.
(G.O.Ms.No.03 తేది:05-01-2011)
- మహిళా ఉద్యోగులకు 5 రోజుల అదనపు సెలవు మంజూరు.
(G.O.Ms.No.142 తేది:01-09-2018)
- వివాహం ఐన మహిళా ఉద్యోగికి 180 రోజులు జీతం తో కూడిన ప్రసూతి సెలవు మంజూరు చేయబడుతుంది.
(G.O.Ms.No.152 తేది:04-05-2010)
- మహిళా ఉద్యోగులు ట్యూబెక్టమి ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో వారికి పద్నాలుగు రోజులకు (14)మించకుండా ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.ఒకవేళ అట్టి ఆపరేషన్ ఏ కారణంచేతనైన ఫలించనియెడల మెడికల్ అధికారి సర్టిఫికెట్ ఆధారంగా మరల పద్నాలుగు(14) రోజులు మంజూరుచేయవచ్చు.
(G.O.Ms.No.1415 M&H తేది:10-06-1968)
(G.O.Ms.No.124 F&P తేది:13-04-1982)
- మహిళా ఉపాధ్యాయులు గర్భనిరోధక సాధనం(LOOP) అమర్చుకున్నరోజు ఒక(1) రోజు ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.128 F&P తేది:13-04-1982)
- ఇద్దరికంటే తక్కువ పిల్లలున్నప్పుడు,ఆపరేషన్ తరువాత మగ,ఆడ పిల్లలందరూ చనిపోయినపుడు రీకానలైజేషన్ చేయించుకునే మహిళా ఉద్యోగికి 21 రోజులు లేదా అవసరమైన రోజులు ఏది తక్కువైతే ఆమేరకు మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.102 M&H తేది:19-02-1981)
- మహిళా ఉద్యోగి హిస్టరెక్టమి ఆపరేషన్(గర్భసంచి తొలగింపు) శస్త్రచికిత్స చేయించుకున్న సందర్భంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఫారసుమేరకు 45 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.52 F&P తేది:01-04-2011)
- చట్టబద్దంగా గాని,అప్రయత్నంగా గాని గర్భస్రావం(Abortion) జరిగినచో 6 వారాల సెలవు మంజూరుచేయబడును.
(G.O.Ms.No.762 M&H తేది:11-08-1976)
- మహిళా ఉద్యోగులు,టీచర్లకు వారి మొత్తం సర్వీసులో 60 రోజులు శిశుసంరక్షణ సెలవు మంజూరు.
(G.O.Ms.No.209 తేది:21-11-2016)
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire