ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యండర్స్ డే : లెఫ్ట్ హ్యండర్స్ ప్రత్యేకతే వేరు!

ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యండర్స్ డే : లెఫ్ట్ హ్యండర్స్ ప్రత్యేకతే వేరు!
x
Highlights

ఎడమ చేతి వాటం వారి ప్రత్యేకత వేరు. మన సెలబ్రిటీల్లో చాలా మంది లెఫ్ట్ హ్యండర్స్ ఉన్నారు. ఈరోజు ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యండర్స్ డే.

పురచేతి వాటం గాడు అని మన ఊర్లలో ఎడం చేతి వాటం వున్న వ్యక్తుల్ని సరదాగా ఆటపట్టించడం మనకి తెలుసు. సహజత్వానికి విరుద్ధంగా కనిపించే కొన్ని పనులు.. కొంత అవహేళనకు గురికావడం సహజం. అయితే, ఎడమ చేతి వాటం అనేది అవహేళన చేయాల్సిన అంశం కాదు. నిజానికి ఎడమ చేతి వాటం ఉన్న వ్యక్తుల శైలి భిన్నంగా ఉండడమే కాకుండా, వారు పట్టుదలతో కార్యసాధకులై ఉంటారు. ప్రపంచ జనాభాలో పది శాతం ఎడమ చేతి వాటం వారున్నారు. వారికోసం ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించారు. వరల్డ్ లెఫ్ట్ హ్యందర్స్ డే.. ప్రతి సంవత్సరం ఆగస్ట్ 13 న జరుపుకుంటారు. ఈ సందర్భంగా లెఫ్ట్ హ్యండర్స్ కు సంబంధించిన కొన్ని విశేషాలు...

మీకో విషయం తెలుసా? ఎడమ చేతి వాతంలో కూడా రకాలుంటాయి. అవును.. కొంతమంది రాయడం వరకే ఎడమ చేతితో రాస్తారు. మిగిలిన పనులన్నీ కుడి చేత్తోనే చేస్తారు. కొందరు ఏదైనా వస్తువుల్ని అందుకోమన్నా.. తీసుకుని పట్టుకోవాలన్నా ఎడమ చేతిని వాడతారు. అంటే.. ఒక క్రికెటర్ ఉన్నాడనుకుందాం.. ఆటను బౌలింగ్ ఎడమ చేత్తో వేస్తాడు. కానీ, మిగిలిన పనులనకు కుదిచేతినే ఉపయోగిస్తారు. కొందరు మాత్రం.. వారి అన్ని పనులూ ఎడమ చేత్తోనే చేస్తారు. ఇలా ఎడమ చేతి వాతంలోనూ ప్రత్యేకతలు ఉన్నాయి.

ఇలా ఎందుకు..

అసలు ఎడమచేతివాటం జన్యువుల, పరిసరాల ప్రభావం కారణంగా వస్తుంది. LRRTM1 జన్యువు తండ్రి నుంచి శిశువుకి సంక్రమిస్తే ఈ లక్షణం ఉంటుంది. శిశువు గర్భంలో ఉన్నప్పుడు తల్లి శరీరంలో ఉండే టెస్టోస్టీరాన్‌ అనే హార్మోన్‌ స్థాయిపై కూడా ఆధారపడి ఈ లక్షణం వస్తుంది. అంతే కాకుండా శిశువు పెరుగుతున్న పరిస్థితుల్లో ఉండే పరిసరాలు కూడా ఎడమ చేతి వాటాన్ని ప్రదర్శించేందుకు దోహదం చేస్తాయి.

ప్రముఖులు ఎందరో..

మన ప్రముఖుల్లో చాలా మంది ఎడమ చేతి వాటం వారున్నారు. మహాత్మా గాంధీ ఎడమ చేతితోనే రాసేవారు. అదేవిధంగా వీరనారీమణి ఝాన్సీ లక్ష్మీభాయి కూడా లెఫ్ట్ హ్యండరే. అంతెందుకు మన ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎడమచేతితోనే రాస్తారు. మనకు తెలిసిన అంతర్జాతీయ ప్రముఖుల్లో అమెరికా మాజీ అధ్యక్షులు బారక్ ఒబామా,బిల్ క్లింటన్, ఇంగ్లాండ్ రాజ వంశస్థులు ప్రిన్స్ చార్లెస్, హాలీవుడ్ రాంబో స్టార్ సిల్వస్టర్ స్టాలిన్, హాలీవుడ్ నటీమణులు ఎంజేలీన జోలీ, మార్లిన్ మన్రో ఇలా చాలా మంది వున్నారు.

ఇక మన దేశానికి వస్తే.. మదర్ థెరిస్సా, రతన్ టాటా, రజనీకాంత్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ప్రముఖ గాయని ఆశా భొంశ్లే, లక్ష్మి మిట్టల్, అభిషేక్ బచ్చన్, గుత్తా జ్వాల, వేణుగాన గంధర్వుడు హరిప్రసాద్ చౌరాసియా, సౌరవ్ గంగూలీ, శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, సినీనటులు ముమ్ముట్టి, ప్రకాష్ రాజ్ ఇలా చెప్పుకుంటూ పోతే.. ఈ లిస్టు చాలా పెద్దది.

లెఫ్ట్ హ్యండర్స్ క్లబ్..

మన దేశంలో ఎడమ చేతి వాటం వారికోసం ఓ క్లబ్ ఉంది. ఎడమ చేతివాటం వారిపట్ల సామాన్య ప్రజల్లో ఉండే అపోహలని తొలగించే ఉద్దేశ్యంతో సందీప్ విష్ణోయ్ 2009లో ఈ క్లబ్ ప్రారంభించారు. ఔరంగాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ క్లబ్ కి దేశవ్యాప్తంగా శాఖలు వున్నాయి. ఈ సంవత్సరం ఈ లెఫ్ట్ హ్యండర్స్ క్లబ్ ఆధ్వర్యంలో లెఫ్ట్ హ్యండర్స్ మ్యూజియం ప్రారంభించారు. గోవాలో ప్రారంభించిన ఈ మ్యూజియంలో వందమంది ప్రముఖ లెఫ్ట్ హ్యందర్స్ విగ్రహాలను తయారు చేయించి ఏర్పాటు చేశారు.

ప్రపంచ లెఫ్ట్ హ్యండర్స్ డే సందర్భంగా లెఫ్ట్ హ్యండర్స్ కి శుభాకాంక్షలు అందిస్తోంది హెచ్ ఎంటీవీ



Show Full Article
Print Article
More On
Next Story
More Stories