టాలీవుడ్ మన్మధుడు గురించి 15 ఇంట్రెస్టింగ్ పాయింట్స్...

టాలీవుడ్ మన్మధుడు గురించి 15 ఇంట్రెస్టింగ్ పాయింట్స్...
x
Highlights

వయసు చెప్పినా నమ్మలేని లుక్ ఆయనది. తెలుగుతెరపై రొమాంటిక్ ప్రేమకథానాయకుడిగా ఎప్పుడూ సోగ్గాడే. గోవిందా అంటూ అన్నమయ్య పాటందుకున్నా.. సుర్రు సుమ్మైపోద్ది అని మాస్ మంత్రం వేసినా.. హలో గురూ ప్రేమకోసమే జీవితం అని రొమాంటిక్ కిల్లర్ గా రెచ్చినా.. ఈ అక్కినేని వారసుడికే చెల్లింది. అందుకే కింగ్ నాగ్ తెలుగుతెర మన్మధుడు!

అరవై సంవత్సరాలు వచ్చిన టాలీవుడ్ లో ఇంకా మన్మధుడు గానే రాజ్యమేలుతున్నాడు కింగ్ నాగార్జున .. అయన ఈరోజు 59 సంవత్సరాలు పూర్తి చేసుకొని 60 వ జన్మదిన వేడుకలను జరుపుకోబోతున్నారు . అక్కినేని నాగేశ్వరరావు కుమారుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగ్ విభిన్నమైన చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు . ముఖ్యంగా ప్రేమకథలకు స్పెషల్ హీరోగా మిగులుతున్నాడు నాగ్ ... మొన్నటికి మొన్నా మన్మధుడు 2 అనే ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడంటే ఇంకా నాగ్ లో అ ప్రేమికుడు ఇంకా పోలేదనే కదా అర్ధం ... అయన పుట్టినరోజు సందర్భంగా నాగ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తెలుసుకుందాం ..

1. అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ దంపతులకు నాగర్జున రెండో కుమారుడు

2. బాలనటుడుగానే నాగార్జున తెలుగుసినిమాల్లో నటించారు . అయన తండ్రి నటించిన సుడిగుండాలు సినిమాల్లో నాగ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించారు .

3. ఆయన సినిమాల్లోకి రాకముందు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు.

4. ప్రముఖ నిర్మాత డాక్టర్ డి రామానాయుడు కుమార్తె లక్ష్మిని అయన 1984లో వివాహం చేసుకున్నారు

5. ఇక నటుడుగా 1986 లో విక్రమ్ సినిమాతో పరిచయం అయ్యారు .

6. అయన మణిరత్నంతో చేసిన గీతాంజలి సినిమా ఆయనకి మంచి గుర్తింపుని తీసుకువచ్చింది .

7.1989లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమా నాగార్జునని స్టార్ హీరోగా నిలబెట్టింది . ఇదే సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు నాగ్

8. 1990 మొదటిభార్యకు లక్ష్మికి విడాకులు ఇచ్చారు . వీరికి పుట్టిన సంతానమే అక్కినేని నాగ చైతన్య

9. 1992లో నాగార్జున హీరోయిన్ అమలని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి పుట్టిన సంతానమే అక్కినేని అఖిల్

10. నాగార్జున హైదరాబాద్ యొక్క బ్లూ క్రాస్ పేరుతో వెళ్ళే ప్రభుత్వేతర సంస్థ (ఎన్జిఓ) సహ వ్యవస్థాపకుడు. ఎన్జీఓ జంతువుల సంక్షేమం కోసం పనిచేస్తుంది మరియు జంతు హక్కులను కాపాడుతుంది.

11. HIV / AIDS అవగాహన కార్యక్రమాలకు నాగార్జున బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నారు .

12. మొత్తం నాగార్జున ఇప్పటివరకు ఒక జాతీయ అవార్డు(అన్నమయ్య), 9 రాష్ట్ర నంది అవార్డులు మరియు 3 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకున్నాడు.

13. ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ సినీ హీరోగానే కాకుండా బడా నిర్మాతల్లో నాగార్జున ఒకరుగా నిలుస్తు వస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ పై అయన సినిమాలు నిర్మిస్తున్నారు .

14. సినిమాలు కాకుండానే ముంబై మాస్టర్స్ ఆఫ్ ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ కి సునీల్ గవాస్కర్ తో కలిసి భాగస్వామిగా వ్యవహరించారు .

15. మనం సినిమాలో నాగ్ తన మొత్తం కుటుంబంతో కలిసి నటించాడు . ఇది తెలుగులో మరే హీరోకి కూడా ఇలాంటి ఘనత దక్కలేదు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories