Indian Railway: బైక్, కారు యజమానులకి హెచ్చరిక.. వినకపోతే 6 నెలల జైలు శిక్ష..!

Indian Railways Warning to Motorists 6 Months Imprisonment if not Listened to Fine of 1000 Rupees
x

Indian Railway: బైక్, కారు యజమానులకి హెచ్చరిక.. వినకపోతే 6 నెలల జైలు శిక్ష..!

Highlights

Indian Railway: భారతీయ రైల్వేలలో సులభంగా అతి చౌకగా ప్రయాణించవచ్చు.

Indian Railway: భారతీయ రైల్వేలలో సులభంగా అతి చౌకగా ప్రయాణించవచ్చు. అయితే రైళ్లని నడపడానికి ప్రత్యేక ట్రాక్‌లు సిద్దం చేస్తారు. రైలు తప్ప మరే ఇతర వాహనం ఈ మార్గంలో వెళ్లకూడదు. అది సాధ్యం కాదు కూడా. అయితే రైల్వే లైన్ రోడ్డును దాటే చోట ఎటువంటి ప్రమాదాలు జరగకుండా రైల్వే గేట్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ రైల్వే సిబ్బంది పనిచేస్తారు. రోడ్డుపై వచ్చే వాహనాలని కంట్రోల్‌ చేస్తూ రైళ్ల రాకపోకలకి ఎటువంటి ఆటంకం లేకుండా చూస్తారు. కానీ ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతుంటాయి.

రైలు రాకపోకలు సాగించే సమయంలో గేట్లు మూసి ఉండడంతో కాసేపు రోడ్డు రాకపోకలు నిలిచిపోతాయి. తర్వాత రైలు వెళ్లగానే గేట్లు తెరిచి ట్రాఫిక్‌ను పునరుద్ధరిస్తారు. కానీ గేటు మూసి ఉన్నప్పుడు కొంత మంది వాహనదారులు గేటు పక్క నుంచి దాటేందుకు లేదా అనుమతి లేని ప్రదేశాల నుంచి రైలు మార్గాన్ని దాటుతుంటారు. ఇలా చేయడం చాలా తప్పు. పట్టుబడితే వారికి 6 నెలల జైలు శిక్ష, రూ. 1000 వరకు జరిమానా విధిస్తారు.

భద్రత కోసం నిర్దేశించిన ప్రదేశాలలో మాత్రమే రైల్వే ట్రాక్‌లను దాటాలి. దీనిని అతిక్రమిస్తే రైల్వే చట్టంలోని సెక్షన్ 147 ప్రకారం అతనికి 6 నెలల వరకు జైలు శిక్ష రూ. 1000 వరకు జరిమానా రెండూ విధించవచ్చు. ఈ నియమం ప్రజలందరికీ వర్తిస్తుంది. అందుకే గేటు పడినప్పుడు అడ్డదారిలో దాటేందుకు ప్రయత్నించవద్దు. ఇది చాలా ప్రమాదం కూడా. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని రైల్వే హెచ్చరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories